
బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor)కి కరోనా సోకింది. తాజాగా సోమవారం ఆమెకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృతి అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) రంగంలోకి దిగారు. కరీనా, అమృతాలను కలిసిన వారిని ట్రేసింగ్ చేస్తున్నారు. వారంతా ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలని తెలియజేశారు.
ఇటీవల వరుసగా Kareena Kapoor పలు పార్టీలు, వేడుకల్లో పాల్గొంది. ఎక్కడ కూడా కరోనా నిబంధనలు ఫాలో కాలేదు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ సోకడం గమనార్హం. అందులో భాగంగా ఆమె ఇటీవల అనిల్ కపూర్ కూతురు రియా కపూర్ ఇంటి వద్ద జరిగిన గెటూగెదర్ పార్టీలో కరీనా పాల్గొంది. చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఇందులో కరిష్మా కపూర్, మలైకా అరోరా, కరీనా మేనేజర్ పూనమ్ దమానియా, మసాబా గుప్తా కూడా పాల్గొన్నారు. కరీనా కపూర్‌కి కరోనా సోకడంతో వారి ఫ్యామిలీతోపాటు వీరందరిలోనూ టెన్షన్ నెలకొంది. మెంబర్స్ సైఫ్ అలీ ఖాన్, పిల్లలు తైమూర్ అలీ ఖాన్ వారంతా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.
కరీనా కపూర్ సెకండ్ డెలివరీ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టిపెడుతుంది. ఫిట్ నెస్ తిరిగి పొందేందుకు రెడీ అవుతుంది. నటిగా మళ్లీ కెరీర్‌ని రన్ చేసేందుకు సన్నద్దమవుతుంది. ప్రస్తుతం కరీనా కపూర్.. అమీర్ ఖాన్‌తో `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో తెలుగు హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. వాలెంటైన్స్ డేకి రిలీజ్ కానుందని టాక్.
కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇండియాలో దాదాపు 40 వరకు కేసులున్నాయి. థర్డ్ వేవ్ రాబోతుందనే ఊహగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సెలబ్రిటీలు కరోనా బారిన పడటం షాక్‌కి గురి చేస్తుంది. మరో ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
also read: ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నీ కూతురికి నేర్పించు.. తల్లీకూతుళ్లపై దారుణంగా ట్రోలింగ్