కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep)పై ఓ నిర్మాత ఆరోపణలు చేశారు. తనకివ్వాల్సిన డబ్బులివ్వలేదని పరువునష్టం కింద కేసు కూడా ఫైల్ చేయించారు.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ‘ఈగ’ సినిమాతో ఇక్కడ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలు తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ అవుతూ వచ్చాయి. చివరిగా ‘విక్రాంత్ రోణా’తో అలరించారు. ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందింది. దీని తర్వాత కాస్తా గ్యాప్ ఇచ్చిన సుదీప్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. కిచ్చా సుదీప్ పై తాజాగా పరువు నష్టం కింద కేసు నమోదైంది. కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేసినట్టు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రొడ్యూసర్స్ ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్ లు కిచ్చా సుదీప్ తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
నిర్మాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. ఎనిమిదేళ్ల కింద కిచ్చా సినిమా ఓ సినిమా చేసేందుకు ఆ నిర్మాతలతో అంగీకరించారు. కాగా, ఇప్పటి వరకు వారికి డేట్స్ ఫిక్స్ చేయలేదు. కోటిగొబ్బ3, విక్రాంత్ రోణ చిత్రాల తర్వాత తమతోనే సినిమా చేస్తానని హామీని కూడా ఇచ్చారు. ఇదే విషయమై సుదీప్ ను కలిసేందుకు ప్రయత్నించినా రెస్పాండ్ కావడం లేదని ఆరోపించారు. తాము చేయబోయే సినిమాకు ‘ముత్తట్టి సత్యరాజు’ అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేసి పెట్టామని, సుదీప్ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదని మండిపడ్డారు.
ఆ సినిమా కోసం తమ వద్ద నుంచి రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారని, ఇప్పటి వరకు తిగిరి ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. ఇక తమపైనే తాజాగా రూ.10 కోట్ల వరకు పరువు నష్టం కేసు దాఖలు చేశారని, తనకు క్షమాపణలు కూడా చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారని నిర్మాతలు పేర్కొన్నారు.. అయితే ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించకపోతే ధర్నా చేస్తామని ప్రొడ్యూసర్ ఎంఎన్ కుమార్ తెలిపారు. కాగా కిచ్చా సుదీప్ ప్రస్తుతం తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ థాను నిర్మిస్తున్నారు.