
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటి మహ్నూర్ బలోచ్.. షారూఖ్ ఖాన్ అసలు అందగాడే కాదని, ఆయనకు అసలు నటన రాదని.. షాకింగ్ కామెంట్స్ విసిరింది. అయితే షారుఖ్ ఖాన్ మాత్రం మంచి బిజినెస్ మెన్ అని మెచ్చుకుంది బలోచ్. షారూఖ్ ఖాన్ కు వ్యాపారం ఎలా చేయాలో తెలుసునని.. ఆయనకు తనను తాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో బాగా తెలుసని మహ్నూర్ కామెంట్ చేసింది. అయితే ఆమె షారుఖ్ గురించి మరో మాట కూడా చెప్పింది. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్నవారని.. ఆయనలోని తేజస్సే ఆయనను సినీ పరిశ్రమలో ఒక పెద్ద హీరోగా నిలబెట్టాయని పాకిస్తాని నటి వ్యాక్యానించింది.
షారుఖ్ ఖాన్ వ్యక్తిత్వం, తేజస్సు చాలా బలమైనవి అంటూనే.. షారుఖ్ ఖాన్ పెద్ద అందగాడు మాత్రం కాదు అంటోంది నటి. కాని ఆయన మంచి మనసు షారుఖ్ ను గొప్పవాడిని చేసింది అని అంటోంది మహ్నోర్.సమాజంలో ఎంతో మంది అందగాళ్లు ఉంటారు. కానీ, ఆకర్షించే తేజస్సు, చలాకీతనం లేక అనామకులుగా మిగిలిపోతారు అని మహ్నూర్ బలోచ్ వ్యాఖ్యానించింది.షారుఖ్ ఖాన్ మార్కెటింగ్ తెలివితేట వల్లనే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో సర్వేవ్ అవుతున్నాడంటోంది నటి. నటన పరంగా చూస్తే.. ఆయనకన్న గొప్పవారు చేలా మంది ఉన్నారంటోంది బలోచ్.
ఇక పాకిస్టానీ స్టార్ మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో నెటిజన్ల నుంచి విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. మహ్నూర్ బలోచీ తన పబ్లిసిటీ కోసం సెలబ్రిటీల లైఫ్ ను టార్గెట్ చేస్తుందని... తన ఫేమస్ అవ్వడం కోసం షారుఖ్ ను టార్గెట్ చేస్తోందంటూ విమర్షలు వస్తున్నాయి. నెటిజన్లు కూడా ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. సూటిగా చెప్పు.. నీకు షారూఖ్ ఖాన్ దృష్టిలో పడాలని ఉందా..?’ అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ‘షారూఖ్ ఖాన్ అంటే ప్రపంచం అంతటికి తెలుసు. నన్ను క్షమించాలి. అసలు నువ్వు ఎవరు..?’ అని ఇంకో నెటిజన్ స్పందించాడు. అటు షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ సినిమాల షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడు. పఠాన్ ఇచ్చిన జోష్ తో జవాన్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఈమూవీ భారీగా ప్రిరిలీజ్ బిజిన్ చేసింది.