కంగనా రనౌత్ వర్సెస్ జావేద్ అక్తర్.. కంగనాకు భారీ షాక్.. ఆధారాలు లేవని ఆ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు..

By team telugu  |  First Published Oct 23, 2021, 3:52 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు గట్టి  షాక్ తగిలింది. తనపై ఉన్న పరువు నష్టం కేసుకు సంబంధించి అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పక్షపాతం చూపించారని కంగనా వేసిన పిటిషన్‌ను ముంబైలోని ది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్  కోర్టు తిరస్కరించింది.


బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు గట్టి  షాక్ తగిలింది. తనపై ఉన్న పరువు నష్టం కేసుకు సంబంధించి అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పక్షపాతం చూపించారని కంగనా  వేసిన పిటిషన్‌ను ముంబైలోని ది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్  కోర్టు తిరస్కరించింది. అంధేరి మెట్రోపాలిటన్ పాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయంగా వ్యవహరించారని తెలిపింది. న్యాయ ప్రక్రియను అనుసరించి కేసును కొనసాగిస్తున్నందున.. దాని  అర్థం పక్షపాతంతో వ్యవహరించడం కాదని వ్యాఖ్యానించింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌టి దండే కేసును బదిలీ చేయాలంటూ కంగనా రనౌత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. Kangana Ranaut పిటిషన్‌ను అక్టోబర్  21నే న్యాయస్థానం తిరస్కరించగా..  ఇందుకు సంబంధించి పూర్తి ఆర్డర్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్‌ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్‌ అక్తర్‌లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్‌లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగనా అన్నారు. దీంతో కంగనాపై Javed Akhtar గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఆ తర్వాత కంగనా రనౌత్ కూడా దోపిడీ, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై జావేద్ అక్తర్‌పై అంధేరి కోర్టులో కౌంటర్ ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి  అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. 

Latest Videos

బెయిల్‌ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తానని పరోక్షంగా బెదిరించడంతో అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుపై తనకు నమ్మకం పోయిందని కంగనా రనౌత్ గత నెలలో బదిలీ పిటిషన్‌ను దాఖలు చేసింది. కోర్టు తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో కంగనా ఆరోపించింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌టి దండే తాజాగా కంగనా పిటిషన్‌ను తిరస్కరించారు. ఆందోళన ఆధారంగా కేసును ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేయలేమని పేర్కొన్నారు.  ‘అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిందితురాలికి న్యాయమైన అవకాశాన్ని కల్పించారని తీర్పు చెప్పింది. ఆ మేజిస్ట్రేట్ జారీచేసిన ఆదేశాలను నేను పరిశీలించాను. వారు న్యాయబద్ధంగా ఉత్తర్వులు జారీ చేసారు. ఆమెపై మేజిస్ట్రేట్ ప్రారంభించిన క్రిమినల్ పరువు నష్టం కేసులను రద్దు చేయాలంటూ కంగనా రనౌత్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయంగా వ్యవహరించారని, పక్షపాతంతో వ్యవహరించలేదని ఇది చూపిస్తుంది’అని పేర్కొన్నారు.

Also read: జగన్ రెడ్డిది స్పెషల్ క్యారెక్టర్...ఆయనకు విలన్ అనే పేరు చిన్నది.. చంద్రబాబు

కంగనా రనౌత్ తన ఆందోళన సహేతుకమైనదని చూపించడానికి.. సానుకూలమైన, ఖచ్చితమైన ఆధారాలను ఇవ్వడంలో విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణ ఆధారంగా.. కేసు బదిలీ చేయబడితే అది ప్రిసైడింగ్ అధికారి యొక్క నైతికతను ప్రభావితం చేస్తుందని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు  తెలిపింది. అంధేరి నుంచి ఏ ఇతర కోర్టుకు కేసును బదిలీ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని తీర్పు వెలువరించింది.

click me!