ఆ లిస్టులో సారా అలీ ఖాన్.. ఇక సేఫ్ అంటూ దారుణంగా ట్రోలింగ్

pratap reddy   | Asianet News
Published : Oct 23, 2021, 03:28 PM ISTUpdated : Oct 23, 2021, 04:22 PM IST
ఆ లిస్టులో సారా అలీ ఖాన్.. ఇక సేఫ్ అంటూ దారుణంగా ట్రోలింగ్

సారాంశం

సెలెబ్రిటీలు ఏం చేసిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతుంది. నెగిటివ్ గా అయినా, పాజిటివ్ గా అయినా సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. 

సెలెబ్రిటీలు ఏం చేసిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతుంది. నెగిటివ్ గా అయినా, పాజిటివ్ గా అయినా సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా బర్త్ డే సందర్భంగా ఆయన్ని విష్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కాస్త రాంగ్ టర్న్ తీసుకుంది. 

ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఆందోళనలో ఉంది. Aryan Khan తో మొదలైన Drugs case లో నెమ్మదిగా ఒక్కో సెలెబ్రిటీ చిక్కుకుంటున్నారు. కొన్ని వారాల క్రితం ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలసి క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కాడు. ఆర్యన్ ఖాన్ నిషేధిత డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు అంటూ NCB అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ స్నేహితులు కూడా అరెస్ట్ అయ్యారు. 

ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కి రిమాండ్ కోనసాగుతోంది. షారుఖ్ బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఒక్కో లింకుని బయటకు లాగుతున్నారు. ఆర్యన్ ఖాన్ తో బాలీవుడ్ యంగ్ బ్యూటీ Ananya Panday వాట్సాప్ చాట్ చేయడంతో ఆమెని కూడా విచారించారు. ఎన్సీబీ లిస్టులో ఇంకా మరికొందరి బాలీవుడ్ తరాల జాబితా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ క్రమంలో Sara Ali Khan.. Amit Shahకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేసింది. దీనితో ఆమెపై దారుణంగా ట్రోలింగ్ మొదలయింది. ఎన్సీబీ లిస్టులో సారా అలీ ఖాన్ పేరు కూడా ఉండి ఉంటుందని.. డ్రగ్స్ కేసు నుంచి బయట పడేందుకే అమిత్ షాకి సారా బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

'ఇక నీపై డ్రగ్స్ కేసు ఉండదు.. నువ్వు సేఫ్' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. 'సారా అలీ ఖాన్ సేఫ్ జోన్ లోకి వెళ్ళింది' అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అసలు ఈ అకౌంట్ ని ఎవరు రన్ చేస్తున్నారు.. బ్లూ టిక్ ఎందుకు ఇచ్చారు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ కామెంట్ పెట్టింది. సారా అలీ ఖాన్ ఇప్పటివరకు కేవలం ఐదు ట్వీట్లు మాత్రమే చేసింది. అమిత్ షా విషెస్ తో కలిపి ఆరు. 

సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ నటిగా ప్రశంసలు అందుకుంటోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇటీవల ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తో మరోసారి డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజులో ఎన్సీబీ ఎవరిని విచారణకు రమ్మని పిలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు