Acharya Release: అన్న చిరంజీవి కోసం రంగంలోకి దిగబోతున్న పవన్ కళ్యాణ్

Published : Apr 10, 2022, 03:10 PM IST
Acharya Release: అన్న చిరంజీవి కోసం రంగంలోకి దిగబోతున్న పవన్ కళ్యాణ్

సారాంశం

ఆమధ్య చిన్న పెద్ద సినిమాలకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతీ సినిమా ఫంక్షన్ కు వెళ్లి వాటిని ప్రమోట్ చేశారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం తమ్ముడు పవర్ స్టార్ రంగంలోకి దిగబోతున్నాడు. 

ఆమధ్య చిన్న పెద్ద సినిమాలకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతీ సినిమా ఫంక్షన్ కు వెళ్లి వాటిని ప్రమోట్ చేశారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం తమ్ముడు పవర్ స్టార్ రంగంలోకి దిగబోతున్నాడు. 

ప్ర‌స్తుతం సినిమాల  స్పీడు పెంచాడు చిరంజీవి.  రీ ఎంట్రీ తరువాత గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా  వ‌రుస‌గా సినిమాల‌ను సెట్స్ ఎక్కిస్తున్నారు మెగాస్టార్. అంతే స్పీడ్ గా  షూటింగ్‌లను కూడా పూర్తి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇక మెగాస్టార్ కొరటాల డైరెక్షన్ లో నటించిన లేటెస్ట్‌ సినిమా ఆచార్య. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. 

ఈ మూవీలో చిరంజీవితో పాటు  స్క్రీన్ శేర్ చేసుకున్నాడు రామ్‌చ‌ర‌ణ్. సిద్ద అనే కీల‌కపాత్ర‌లో న‌టించాడు చరణ్.  ఇక ఈ మూవీ ఈనెల 29న రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు ప్రమోషన్ల హడావిడి స్టార్ట్ చేయబోతున్నారు ఆచార్య టీమ్. అయితే ఇప్పికే ఈమూవీ నుంచి ట్రైలర్ ను ఈనెల 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు టీమ్. 

ఇదే క్ర‌మంలో ఆచార్య‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏప్రిల్24న జ‌ర‌గ‌బోతున్న‌ట్లు తెలిపారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రానున్న గెస్టుల గురించి ఓ రూమర్  సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అన్నకు సపోర్ట్ చేయడానికి తమ్ముడు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్గ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టు సమాచారం. 

యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఆచార్య ప్రిరిలీజ్ కు ప్లాన్ చేశారు టీమ్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిలుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కేటీఆర్‌లు రానున్న‌ట్లు తెలుస్తుంది. దీనిపై మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అయితే భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ కూడా ఇక్కడే జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా కేటీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. 

ఇప్ప‌టికే చిత్రం నుంచి రిలీజ్ అయిన  టీజ‌ర్, సాంగ్స్, పోస్టర్స్ కు ఆడియన్స్ లో బారీగా రెస్పాస్స్ వచ్చింది. అంతే కాదు ఇప్పటికే ఈసినిమాపై భారీగా  అంచ‌నాల‌ కూడా ఏర్పడ్డాయి. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్టైనమెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?