
బాలీవుడ్ క్వీన్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రనౌత్. ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ సినిమాతో ఇండియన్ స్క్రీన్ ను షేక్ చేయడానికి రెడీగా ఉంది. అంతే కాదు సౌత్ నుంచి చంద్రముఖిగా భయపెట్టడానికి కూడా రెడీ అవుతోంది. తనకు వచ్చిన ఆఫర్లలో... తనకు నచ్చినది మాత్రమే చేసే కంగనా ఓ పెద్ద ఆఫర్ ను తిరస్కరించి అందరిని షాక్ కు గురిచేసిందట. ఇంతకీ విషయం ఏంటీ అంటే... తమిళ సూపర్‌స్టార్ ధనుష్ డి50 సినిమాలో నటించేందుకు కంగనా నిరాకరించిందని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నారు. ఈ విషయంలో థనుష్ ఫ్యాన్స్ కూడా స్పందించడం మొదలు పెట్టారు.
ఇక ఇందుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉండగా.. కంగనా రనౌత్ ఈ విషయంలో స్వయంగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఆ వార్తా కథనం యొక్క స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన కంగనా.. ఫేక్ న్యూస్ అలర్ట్ పెట్టేసింది. అంతే కాదు అలాంటి సినిమా ఏది నాకు ఆఫర్ చేయలేదు.. దానిని నేను తిరస్కరించలేదు. ఎవరో కావాలని చేసిన...రాసినా.. న్యూస్ ఇది అని చెప్పుకొచ్చింది బ్యూటీ. అంతే కాదు.. ధనుష్ నాకుచాలా ఇష్టమైన వ్యక్తి, నేను అతనికి నో చెప్పలేను అని కంగనా పేర్కొంది. దాంతో అప్పటి వరకూ కోపంతో ఊగిపోయిన థనుష్ ఫ్యాన్స్ చల్లబడటమే కాకుండా.. దిల్ ఖుష్ అవుతున్నారు.
ఇక తమిళనాటనే కాకుండా.. సౌత్ అంతట భారీ సినిమాలకు పెట్టింది పేరు సన్ పిక్చర్స్. ఈ బ్యానర్‌పై ధనుష్ తన 50వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించి.. ఇందులో ప్రధాన పాత్ర కోసం కంగనా రనౌత్‌ను సంప్రదించారని.. అయితే ఆమె నటించడానికి నిరాకరించిందని మీడియా కథనంలో పేర్కొంది. నెగెటివ్ రోల్ కోసం కంగనాను సంప్రదించగా ఆమె ఆఫర్‌ను తిరస్కరించిందని ప్రచారంజరిగింది. అయితే ఈవార్తల్లో నిజం లేదంటూ.. కంగనా స్పందించడంతో అన్ని ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.
ధనుష్ 50వ సినిమా చాలాప్రత్యేకంగా ఉండబోతోందట.. అది కూడా తన పస్ట్ మూవీ అయిన పుదుపేట్టై కి సీక్వెల్ గా ఈసినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో.. భాయంకరమైన స్లమ్ లో నివసించే ఓ విద్యార్థి భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారిన కథ ఇది. మరి ఇది నిజం అయితే.. సీక్వెన్ లు అంతకు మించి ప్లాన్ చేసే అవకాశం ఉంది. మరి ఇది ఎంత వరకూ నిజం .. ఎంత వరకూ వర్కైట్ అవుతుందో చూడాలి.