మ‌ణిక‌ర్ణికాలో కంగ‌నా లుక్ పై హాట్ న్యూస్‌

Published : Apr 23, 2017, 08:03 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మ‌ణిక‌ర్ణికాలో కంగ‌నా లుక్ పై హాట్ న్యూస్‌

సారాంశం

సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తున్న ఫోటో క్లారిటీ ఇవ్వ‌ని చిత్ర బృందం మ‌రో చారిత్రాత్మ‌క సినిమాపై క‌న్నేసిన క్రిష్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక-ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మీబాయిగా కంగనా ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఫొటోలో కంగనా తలపాగా నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

 క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ జూన్‌ మొదటివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. కంగనా ఈ సినిమాతో పాటు ‘సిమ్రన్‌’ సినిమాలో నటిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు