రాశీఖన్నా విలన్‌గా మారబోతోందా?

Published : Apr 23, 2017, 07:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రాశీఖన్నా విలన్‌గా మారబోతోందా?

సారాంశం

రాశీఖన్నా విలన్‌గా మారబోతోందా? క‌థానాయ‌కుడిగా మోహ‌న‌లాల్‌ ప్ర‌ధాన పాత్ర‌లో విశాల్‌

 మోహన్‌లాల్‌ కథానాయకుడిగా ఉన్ని కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విలన్‌’. ఈ సినిమాలో విశాల్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

అయితే ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కన్పించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అందాల తార రాశీఖన్నా ఓ అవినీతి పోలీసు అధికారిణిగా కన్పించబోతోందని.. ఆమె పాత్రనే ఈ సినిమాలో ‘విలన్‌’ అని మరో పుకారు కూడా చక్కర్లు కొడుతోంది. విశాల్‌, రాశీఖన్నాతో పాటు హన్సిక, శ్రీకాంత్‌, మంజువారియర్‌ లాంటి స్టార్స్‌ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని ఎర్నాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకొంటోంది. 

భారత్‌లోనే తొలిసారి 8కే రిజల్యూషన్‌ ఫార్మాట్‌లో రూపొందుతోంది. మలయాళంలో భారీ బడ్జెట్‌ చిత్రంగానూ రికార్డు సృష్టిస్తోంది.రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు