
నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. కంగనా రనౌత్ ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలపై, ప్రస్తుతం రాజకీయాలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు.
బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు గిట్టని వారు చాలా మందే ఉన్నారు. కొందరి పేర్లు వింటేనే కంగనా కోపంతో రగిలిపోతుంది. ఇక మీడియా ముందు కూడా కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కంగనా మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర సంఘటన జరిగింది.
కంగనా రనౌత్ త్వరలోనే ఓ క్రేజీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతోంది. దీనికి సంబందించిన మీడియా సమావేశం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ దీపికా పదుకొనె నటించిన ‘గెహ్రాయాన్’ చిత్రం గురించి మాట్లాడాడు. ఈ చిత్రంలో దీపికా బోల్డ్ గా నటించింది. లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.
ఇక ప్రచార కార్యక్రమాల్లో కూడా దీపికా బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ సరికొత్త అవుట్ ఫిట్స్ లో మెరిసిన దృశ్యాలు చూశాం. దీని గురించి రిపోర్టర్ కంగనాని ప్రశ్నించగా ఆమె ఒక రేంజ్ లో ఫైర్ అయింది. దీపికా తనని తాను రక్షించుకోగలదు. తమని తాము రక్షించుకోలేని వారికోసం మాత్రమే నేను ఉన్నాను.
కాబట్టి దీపికా సినిమాని ఇక్కడ ప్రమోట్ చేయవద్దు అని ఘాటుగా స్పందించింది. దీనికి రిపోర్టర్ బదులిస్తూ ఆ సినిమాని ప్రమోట్ చేయడం నా ఉద్దేశం కాదు అని తెలిపాడు. దీనికి కంగనా మాట్లాడుతూ.. లేదు మీరు ఆ సినిమా పేరు ఇక్కడ ప్రస్తావించారు. అది సరైన విధానం కాదు అంటూ కంగనా మండిపడింది.