Prabhas Help: అభిమాని కుటుంబానికి అండగా ప్రభాస్... ఆర్థికంగా ఆదుకున్న స్టార్ హీరో

Published : Mar 15, 2022, 12:34 PM IST
Prabhas Help: అభిమాని కుటుంబానికి అండగా ప్రభాస్... ఆర్థికంగా ఆదుకున్న స్టార్ హీరో

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమా కోసం మరణించని అభిమాని కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించాడు. వారికి ఆర్ధికంగా సహాయం చేశాడు యూనివర్సల్ స్టార్.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పూజ హెగ్డే జంటగా నటించిన  సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా శుక్రవారం(మార్చి11) థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 వేలకు పైగా  స్క్రీన్లలో  రాధే శ్యామ్ రిలీజ్ అయ్యింది రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్ లో ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ లంటి స్టార్స్ నటించిన ఈసినిమా మూడేళ్ల నిరీక్షణ తరువాత రిలీజ్ అవ్వడంతో అభిమానులు ఎన్నో ఎక్స్ పెక్ట్ టేషన్స్ పెట్టుకున్నారు. 

తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సినిమా విషయంలో కొన్ని ప్రాంతాల్లో మిక్స్ టాక్ రావడం.. మరికొన్ని ప్రాంతాల్లో అస్సలు బాలేదు.. సినిమా ప్లాప్ అని టాక్ రావడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. ఓ అభిమాని అయితే ఏకంగా ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇక మరో అభిమాని ప్లేక్సీలు కడుతూ జరిగిన ప్రమాదంలో మరణించాడు.

ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక బ్యానర్ కడుతూ చల్ల కోటేశ్వరరావు అనే అభిమాని ప్రమాదవశాత్తు మరణించాడు.అతని మరణం గురించి తెలుసుకున్న ప్రభాస్ వెంటనే రెండు లక్షల రూపాయలు ఆయన భార్య పిచ్చమ్మ అకౌంట్లో జమ చేయాలంటు తన సిబ్బందికి చెప్పినట్టు తెలుస్తోంది. 

చల్లా కోటేశ్వరరావు అనే అభిమాని చాలా పేదవాడు అని అతని కుటుంబం రోడ్డున పడిందని  ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో… వెంటనే స్పందించిన ప్రభాస్ అతని కుటుంబానికి సాయం ప్రకటించారు. భవిష్యత్తులో కూడా అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రభాస్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి దైర్యం చెప్పినట్లు సమాచారం. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు