కర్ణిసేనకు వార్నింగ్.. ఎవరిని వదిలిపెట్టను!

By Prashanth MFirst Published Jan 18, 2019, 4:35 PM IST
Highlights

మహారాష్ట్ర కర్ణిసేన నుంచి సినిమాపై అభ్యంతరాలు వస్తుండడంతో కంగనా కూడా తన వివరణ ఇచ్చింది. 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మొండిపట్టు ఎలాంటిధో అందరికి తెలిసిందే. విభేదాలతో దర్శకుడిని సైతం పక్కకు తప్పించి సొంతంగా డైరెక్ట్ చేసి మణికర్ణిక సినిమాను పూర్తి చేసింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర కర్ణిసేన నుంచి సినిమాపై అభ్యంతరాలు వస్తుండడంతో కంగనా కూడా తన వివరణ ఇచ్చింది. 

నేను కూడా రాజ్ పుత్ నే అంటూ ఎంత చెప్పినా అదేపనిగా వేధిస్తే ఎవరిని విడిచిపెట్టను అంటూ కర్ణిసేనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  నలుగురి చరిత్రకారులకు కూడా సినిమా చూపించమని సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ను కూడా పొందినట్లు చెప్పిన కంగనా కర్ణిసేనకు కూడా ముందు నుంచి సినిమాపై వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. 

ఇక ఇప్పుడు మళ్ళీ అభ్యంతరాలు తెలుపుతుండడంతో కర్ణిసేన తీరుపై కంగనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మణికర్ణికకు మొదట క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అనేక వివాదాల నడుమ ఫైనల్ పార్ట్ ను కంగనా ఫినిష్ చేసి రిలీజ్ కు సిద్ధం చేసింది.  జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

కర్ణిసేన హెచ్చరిక: అప్పుడు పద్మావతి ఇప్పుడు మణికర్ణిక!

click me!