సంక్రాంతి సినిమాలు.. రూ.100 కోట్ల నష్టం!

By Udayavani DhuliFirst Published Jan 18, 2019, 4:10 PM IST
Highlights

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి వందల కోట్లతో వ్యాపారం జరుగుతుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు. సినిమాలు సక్సెస్ అయితే రెండు నుండి మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. 

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి వందల కోట్లతో వ్యాపారం జరుగుతుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు. సినిమాలు సక్సెస్ అయితే రెండు నుండి మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. కానీ బోల్తా కొడితే మాత్రం భారీ నష్టాలను చవిచూడాల్సివస్తుంది.

ఈ ఏడాది పరిస్థితి అలానే మారింది. రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. రజినీకాంత్ 'పేటా' సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఏవరేజ్ టాక్ తో సేవ్ అయిపోయింది.

వెంకీ, వరుణ్ ల 'ఎఫ్ 2' కూడా మంచి లాభాలను తీసుకొచ్చింది. కానీ చరణ్, బాలయ్యల సినిమా కారణంగా దాదాపుగా వంద కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు  చెబుతున్నారు. 'వినయ విధేయ రామ' సినిమా రూ.100 కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేశారు. అలానే ఎన్టీఆర్ బయోపిక్ కూడా రూ.70 కోట్ల వరకు వసూలు చేస్తుందని అనుకున్నారు.

దానికి తగ్గట్లే ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఎక్కువ మొత్తాలను చెల్లించి సినిమాను కొన్న బయ్యర్లకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. లాభాల సంగతి పక్కన పెడితే కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాంగ్ రన్ లో 'వినయ విధేయ రామ' రూ.60 కోట్లను రాబట్టే ఛాన్స్ ఉంది. 

వంద కోట్లు చేయాల్సిన సినిమా అరవై కోట్లే తెస్తుందంటే దాదాపు నలభై కోట్ల నష్టం. ఎన్టీఆర్ కథానాయకుడు విషయంలో కూడా మరో నలభై కోట్లు నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమాలను నమ్ముకొని పార్కింగ్, ఫుడ్ వ్యాపారం చేసే వాళ్లకు కూడా భారీ నష్టాలు కలిగాయట. మొత్తంగా ఎలాచూసుకున్నా.. సంక్రాంతి సినిమాల కారణంగా వంద కోట్ల నష్టాలు తప్పడం లేదు. 

 

click me!
Last Updated Jan 18, 2019, 4:10 PM IST
click me!