కర్ణిసేన హెచ్చరిక: అప్పుడు పద్మావతి ఇప్పుడు మణికర్ణిక!

By Prashanth MFirst Published Jan 18, 2019, 3:58 PM IST
Highlights

బాలీవుడ్ లో మరోసారి హిస్టారికల్ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంగనా నటించిన మణికర్ణిక సినిమాను అడ్డుకునేందుకు మహారాష్ట్ర కర్ణిసేన టార్గెట్ చేసింది

బాలీవుడ్ లో మరోసారి హిస్టారికల్ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంగనా నటించిన మణికర్ణిక సినిమాను అడ్డుకునేందుకు మహారాష్ట్ర కర్ణిసేన టార్గెట్ చేసింది. సినిమా యూనిట్ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు. గతంలో దీపిక పదుకొనె పద్మావత్ సినిమాపై కూడా ఇదే తరహాలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు మరోసారి కర్ణిసేన మణికర్ణిక చిత్రంలో పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు తెలిపింది. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత ఆధారంగా మణికర్ణికను తెరక్కించారు. అయితే  బ్రిటిష్ రాజుతో ఝాన్సీ లక్ష్మి బాయ్ సన్నిహితంగా ఉన్నట్లు సినిమాలో చూపించినట్లు కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ముందు నుంచి చిత్ర యూనిట్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ వస్తోంది. తప్పుగా చూపించలేదని సెన్సార్ బోర్డు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పింది. 

ఇప్పుడు కర్ణిసేన వివాదస్పదంగా హెచ్చరికలు జారీ చేస్తుండడంతో పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. అయితే విడుదలను అడ్డుకుంటామని కర్ణి సేన హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి గతంలో జరిగినట్లు చేయిదాటిపోకూడదని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. క్రిష్ - కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమా కథను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ రచించారు. 

కర్ణిసేనకు వార్నింగ్.. ఎవరిని వదిలిపెట్టను!

click me!