కాంచన 3 నటి మిస్టీరియస్ డెత్... గోవా అపార్ట్మెంట్ లో ఉరికి వేలాడుతూ

Published : Aug 24, 2021, 08:08 AM IST
కాంచన 3 నటి మిస్టీరియస్ డెత్... గోవా అపార్ట్మెంట్ లో ఉరికి వేలాడుతూ

సారాంశం

అలెగ్జాండ్రా జావి గోవాలో ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు నివాసం ఉంటున్నారు. సదరు అపార్ట్మెంట్ లో అలెగ్జాండ్రా జావి ఫ్యాన్ కి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. ఆమె మరణించిన మూడు రోజులకు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తుంది. 


రష్యన్ మోడల్ కమ్ నటి అలెగ్జాండ్రా జావి మృతి ఒక్కసారిగా కలకలం రేపింది. అలెగ్జాండ్రా జావి తన నివాసంలో ఉరివేసుకొని మరణించారు. అయితే అలెగ్జాండ్రా జావి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మిస్టీరియస్ డెత్ గా కేసు నమోదు చేసి విచారణ చెప్పట్టారు. అలెగ్జాండ్రా జావి గోవాలో ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు నివాసం ఉంటున్నారు. సదరు అపార్ట్మెంట్ లో అలెగ్జాండ్రా జావి ఫ్యాన్ కి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. ఆమె మరణించిన మూడు రోజులకు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తుంది. 


కాగా అలెగ్జాండ్రా జావి ఇటీవల ప్రియుడుతో గొడవపడ్డారని, ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం. అలెగ్జాండ్రా జావి ప్రియుడితో విడిపోయిన బాధలో ఆత్మహత్య చేసుకున్నారా అనేది ఒక వాదన. అలాగే ఇటీవల ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ వ్యక్తితో పాటు అలెగ్జాండ్రా జావి మాజీ లవర్ ని పోలీసులు విచారిస్తున్నారు. 


ఇక లారెన్స్ కాంచన సిరీస్ లో అలెగ్జాండ్రా జావి జావి నటించడం జరిగింది. కాంచన 3లో ఆమె పగ తీర్చుకునే దెయ్యం పాత్ర చేశారు. కాంచన 3 కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. 


 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి