తన లవ్‌ స్టోరీ రివీల్‌ చేసిన ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ.. లోహితతో పదేళ్ల నాటి ఫోటో

Published : Aug 23, 2021, 09:32 PM IST
తన లవ్‌ స్టోరీ రివీల్‌ చేసిన ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ.. లోహితతో పదేళ్ల నాటి ఫోటో

సారాంశం

ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ అసలు సీక్రెట్‌ రివీల్‌ చేశారు. ఎవరికీ ఎలాంటి రిస్క్ లేకుండా తాను చేసుకోబోతున్న లోహిత గురించి వివరాలు వెల్లడించారు. 

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ హీరో కార్తికేయ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని షాకిచ్చాడు. ఆయన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తలుక్కుమనడంతో అభిమానులే కాదు, చిత్ర వర్గాలు కూడా షాక్ అయ్యారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఎలా కలిశారు, బంధువుల అమ్మాయా? లేక లవ్వా అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆ అమ్మాయి గురించి అన్వేషించే పనిలో బిజీ అయ్యారు. 

ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ అసలు సీక్రెట్‌ రివీల్‌ చేశారు. ఎవరికీ ఎలాంటి రిస్క్ లేకుండా తాను చేసుకోబోతున్న లోహిత గురించి వివరాలు వెల్లడించారు. `నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది` అంటూ కార్తికేయ అభిమానులతో పంచుకున్నాడు. 

బెస్ట్‌ఫ్రెండ్‌ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లోహిత కార్తి​కేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇక `ఆర్‌ఎక్స్‌ 100` మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. `గుణ 369`, `చావు కబురు చల్లగా` వంటి సినిమాలతో పలకరించాడు. నానీ `గ్యాంగ్‌లీడర్‌` మూవీలో విలన్‌గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్‌ `వాలిమై`,  `రాజా విక్రమార్క` అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి