‘భీమ్లానాయక్‌’: పవన్ ని హైలెట్ చేయటం వెనక అసలు మ్యాటర్

By Surya PrakashFirst Published Aug 24, 2021, 7:38 AM IST
Highlights

 రీసెంట్‌గా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్  షూటింగ్ విరామంలో న్ చేతపట్టి బుల్లెట్ట వర్షం కురిపించారు. దానికి సంబంధించిన వీడియో హైలెట్ అయ్యాయి. 

 మూడేళ్ళ గ్యాప్  తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌‌‌‌గా మన ముందుకు వచ్చారు పవన్‌.  వకీల్‌ సాబ్‌ సూపర్ హిట్ తో పవన్‌ సెకండ్‌ ఫేజ్‌.. సక్సస్‌ ఫుల్‌‌‌‌గా మొదలైంది. అదే ఊపులో యంగ్‌ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు లైన్లో పెట్టిన పవన్‌.. వాటని సూపర్‌ ఫాస్ట్‌‌‌‌గా కంప్లీట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ ప్రక్క హరి హర వీరమల్లు వంటి పీరియాడికల్ కథతో  రెడీ అవుతూనే భీమ్లా నాయక్‌గా థియోటర్లలో దిగిపోతున్నారు పవన్‌. 

వరుస ప్రాజెక్టులతో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లానాయక్‌’గా అదరకొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు.  రీసెంట్ గా “బీమ్లా నాయక్” గ్లింప్స్ రిలీజ్ చేసారు. బయిటకు వచ్చిన అతి తక్కువ గంటల్లోనే సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం మాత్రమేకాక సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని ఒక్కసారిగా పెంచేసింది.

అయితే రిలీజ్ అయిన తర్వాత చిన్నపాటి డిస్కషన్ మొదలైంది. మీడియా కూడా దాన్ని హైలెట్ చేసింది.  “బీమ్లా నాయక్” గ్లింప్స్ లో మల్టీస్టారర్ అన్నట్లుగా కాకుండా పవన్ పాత్ర పేరు టైటిల్ గా పెట్టడం.. రానాకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం కనపడింది. దీంతో రానా అభిమానులు హర్ట్ అయ్యారంటూ  సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. అలా ఎందుకు చేసారు అంటే ఓ స్ట్రాటజీ ప్రకారమే ఇలా జరిగిందని తెలుస్తోంది.

మలయాళ ఒరిజనల్ సినిమా లెక్కల్లో చూసుకుంటే ఇద్దరు హీరోలకు సమాన వెయిటేజ్ కలిగిన స్టోరీ. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తెలియంది కాదు. దాంతో  పవన్ మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి టీజర్, ట్రైలర్స్ లలో పవన్ ని హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు రానాతో డిస్కస్ చేసారని, ఆయన ఓకే చేసారని వినికిడి.  సినిమాలో కథని కథగానే చూపెడతరని..కేవలం ప్రమోషన్స్ లో మాత్రమే రానా నీ కొద్దిగా ప్రమోట్ చేస్తున్నట్లు మీడియా వర్గాల టాక్.  అంతంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేసినప్పుడు పవన్ మార్కెట్ క్యాష్ చేసుకోవాలనుకోవటంలో తప్పేమీ లేదని, అందుకే “బీమ్లా నాయక్” నిర్మాతలు సరి కొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ సిద్ధమవుతోంది. ఒరిజనల్ లో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

click me!