BrahmaMudi: కళ్యాణ మండపం నుంచి పారిపోయిన స్వప్న.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కనకం?

Published : Mar 01, 2023, 12:26 PM IST
BrahmaMudi: కళ్యాణ మండపం నుంచి పారిపోయిన స్వప్న.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కనకం?

సారాంశం

BrahmaMudi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 1వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

ఈరోజు ఎపిసోడ్లో కావ్య,స్వప్న,అప్పు ముగ్గురు కలిసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు సరే అక్క టైం అవుతుంది తొందరగా బట్టలు మార్చుకోవ అనడంతో మీరు బయటకు వెళ్ళండి కావ్య నేను బట్టలు మార్చుకుంటాను అని అంటుంది స్వప్న. ఇప్పుడు కావ్య బయటికి వెళ్తున్న కోరుకున్న విధంగానే కోటీశ్వరులు ఇంటికి కోడలు కాబోతున్నావు. ఆనందంగా సంతోషంగా ఉండు అక్క అని చెప్పి చెబుతుంది. కావ్య అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోగా సారీ కావ్య నువ్వు చిన్నప్పటి నుంచి నాకోసం ఎంతో చేశావు. అపర్ణ ఎలాగో అలా బతికేస్తుంది కానీ నువ్వే చాలా అమాయకంగా ఉన్నావు అని అనుకుంటూ ఉంటుంది.

మరొకవైపు స్వప్న పెళ్లి మండపం నుంచి పారిపోవడానికి బట్టలు నగలు అని కూడా సర్దుకుంటూ ఉంటుంది. మరోవైపు పెళ్ళికొడుకు రాజ్ వాళ్ళు అందరూ కళ్యాణమండపం కి వస్తారు. అప్పుడు కావ్య రాజ్ వాళ్ళని చూసి ఒక చాటున దాక్కుంటుంది. అప్పుడు కనకం వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వస్తారు. మరోవైపు స్వప్న పెళ్లి మండపం నుంచి పారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రాజ్ వాళ్లు లోపలికి వెళ్తుండగా ఇంతలోనే ఒక అతనికి ఫోన్ చేసి ఫైర్ ఆక్సిడెంట్ అయింది అనడంతో రాహుల్ ఇదంతా నా ప్లానే అనుకుంటూ ఉంటాడు. స్వారీ రాజ్ నీ పెళ్లికూతురు ఇంకొద్ది సేపట్లో నీ దగ్గరికి వస్తుందని మురిసిపోతున్నట్టున్నావు అని అనుకుంటూ ఉంటాడు రాహుల్. 

మరోవైపు పెళ్లి మండపం నుంచి పారిపోయిన స్వప్న రాహుల్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాజ్ వాళ్ళు వెళ్లి కళ్యాణ మండపంలో పెళ్ళికొడుకుగా కూర్చుని ఉంటాడు. అప్పుడు పెళ్లికూతురుని తీసుకొని రమ్మని చెప్పడంతో కనకం సంతోషంగా స్వప్న పిలుచుకొని రావడానికి వెళ్లి స్వప్న గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు బాత్రూం గదిలో ఉంది అని అక్కడికి వెళ్లగా అక్కడ కూడా లేకపోవడంతో కనకం షాక్ అవుతుంది. అప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళగా అక్కడికి పేపర్ చూసి భయంగా అక్కడికి వెళ్లి చూడగా ఆ పేపర్లో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అందుకే దూరంగా పారిపోతున్నాను దిగులు పడకు అని స్వప్న రాసి ఉండడంతో అది చూసి కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది.

మరోవైపు రాజ్ పెళ్లి మండపంలో పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు రాజ్ స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ మరదలు వాళ్లు ఆట పట్టిస్తూ ఉంటారు. మరోవైపు కనకం స్వప్న అన్న మాటలు తలుచుకొని ఫుల్ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గుండెలు వెలిసేలా రోదిస్తూ ఒసేయ్ స్వప్న ఎందుకే ఇలా చేశావు నీకు ఇష్టమైన సంబంధమే తీసుకొచ్చాను కదా ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు అనుకుంటూ గుండెలో భాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు పెళ్లి కూతురిని తీసుకురండి అనడంతో కనకం వాళ్ళ అక్క ఏమి చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య అమ్మ ఇంతసేపు అయింది లోపలికి వెళ్లి అక్కని ఏంటి ఇంకా తీసుకోలేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది.

నీకోసం నీ భవిష్యత్తు కోసం ఈ పెళ్లి కోసం ఎన్ని అబద్ధాలు ఆడాను. ఆడరాన్ని అబద్ధాలు ఆడాను ఆఖరికి ఇంటిని కూడా తాకట్టు పెట్టాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లికూతురు తీసుకొని రమ్మని చెబితే నేను ఏం చేయాలి నా మొఖం వాళ్లకు ఎలా చూపించాలి లేదు నేను బతకూడదు అనుకుంటూ ఫ్యాన్ కు ఉరి వేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే కావ్య అక్కడికి చూసి కనకాన్ని చూసి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ పిచ్చి పట్టిందా నీకేమైనా అయితే నేను తట్టుకోగలమా అనడంతో కూతురు కూతురు అని నెత్తిన పెట్టుకున్నందుకు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అనడంతో ఏం జరిగిందో చెప్పమ్మా అనగా అప్పుడు ఆ లెటర్ చూసి కావ్య కూడా షాక్ అవుతుంది.

 మరో వైపు స్వప్న ని పికప్ చేసుకోవడానికి రాహుల్ రావడంతో స్వప్న కారు ఎక్కి వెళ్ళిపోతుంది. అది చూసిన అప్పు వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అప్పు వాళ్ళ అక్క కళ్యాణ మండపం లేకుండా ఇక్కడే ఉంది అనుకుంటూ ఉంటాడు. తర్వాత అతను వెళ్లి అపర్ణకి అసలు విషయం చెప్పడంతో షాక్ అయినా అపర్ణ పరిగెత్తుకుంటూ స్వప్న రూమ్ కి వెళుతుంది. అప్పు వచ్చావా స్వప్నక్క లేదే అనడంతో అది ఎవడి కారులోనే ఎక్కి వెళ్ళిపోయింది అంట అనడంతో కావ్య, కనకం ఇద్దరు షాక్ అవుతారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు