`నాటు నాటు`కి కొరియన్‌ ఎంబసీ కిర్రాక్‌ డాన్సు.. వైరల్‌ వీడియో షేర్‌ చేసిన చెర్రీ

Published : Mar 01, 2023, 11:55 AM IST
`నాటు నాటు`కి కొరియన్‌ ఎంబసీ కిర్రాక్‌ డాన్సు.. వైరల్‌ వీడియో షేర్‌ చేసిన చెర్రీ

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌`లోని నాటు నాటు సాంగ్‌ హవా కొనసాగుతుంది. దాని క్రేజ్‌ ఇప్పుడు మూమాలుగా లేదు. ఆస్కార్‌ బరిలో నిలిచిన నేపథ్యంలో మరింత క్రేజ్‌ నెలకొంది. తాజాగా కొరియన్‌ ఎంబసీ అధికారులు ఈ పాటకి డాన్సు చేయడం విశేషం.

ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ కంటే `నాటు నాటు` మేనియాలో సాగుతుంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాటకి డాన్సు చేసిన వీడియో క్లిప్పులే నెట్టింట బాగా దర్శనమిస్తున్నారు. దేశాలు దాటి, ఖండాలు దాటుకుని వెళ్తుంది. క్రేజ్‌కి కాదేని అనర్హం అన్నట్టుగా మారిపోయింది. ఎంతో మంది సెలబ్రిటీలు `నాటు నాటు` పాటకి స్టెప్పులేశారు. ఇప్పుడు ఇది ఆస్కార్‌ బరిలో ఉండటంతో మరింతగా పాపులారిటీని పొందింది. 

తాజాగా ఈ `నాటు నాటు` పాటకి కొరియన్‌ ప్రభుత్వ అధికారులు డాన్సులు వేయడం విశేషం. ఇండియాలోని కొరియన్‌ ఎంబసీ అంబాసిడర్‌తోపాటు వారి స్టాఫ్‌ మెంబర్స్ కలిసి ఈ పాటకి డాన్సు చేశారు. అంతేకాదు, దీన్ని ఓ వీడియో రూపంలో చిత్రీకరించారు. పర్‌ఫెక్ట్ మ్యాచింగ్‌తో కొరియన్‌ ఎంబసీ(ఇండియా) అధికారులు ఈ డాన్సులు చేయడం విశేషం. ఇంకా చెప్పాలంటే వాళ్ల డాన్స్‌ కిర్రాక్‌గా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కొరియన్‌ ఎంబసీ ఇండియా అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోని పంచుకుంది. 

ఇది వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరో రామ్‌చరణ్‌ సైతం ఈ వీడియోని షేర్‌ చేశారు. కొరియన్‌ ఎంబసీ ట్వీట్‌ని షేర్‌ చేస్తూ, అత్యుత్తమ నృత్య కదలికలు, నాటు నాటు పట్ల ఉన్న ప్రేమకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది మరింత వైరల్‌గా మారుతూ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. 

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని సాంగ్‌ `నాటు నాటు` అనే విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి ఇందులో డాన్సు చేశారు. అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రపంచానికి ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. ఇక ఈ సినిమాలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. గతేడాది మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. సుమారు రూ12వందల కోట్లు వసూలు చేసింది. అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇప్పుడు `నాటు నాటు` సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ బరిలో నిలిచింది. 

దీనికోసం రామ్‌చరణ్‌, రాజమౌళి, ఇతర టీమ్‌ సభ్యులు అమెరికాలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రామ్‌చరణ్‌ అక్కడ తన జోరు కొనసాగిస్తున్నారు. వరుసగా మీడియా ఇంటర్వ్యూలకు హజరవుతున్నారు. ఆ మధ్య `జీఎంఏ` మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఇప్పుడు `కేటీఎల్‌ఏ 5` అనే మీడియాతో ముచ్చటించారు. తాజాగా ఆ సంస్థ ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌చరణ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'సిగరెట్ తాగుతూ స్టైల్‌గా..! ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్న రజినీకాంత్..'
Niharika: చిరంజీవి క్యాస్టింగ్‌ కౌచ్‌ కామెంట్‌పై నిహారిక అదిరిపోయే రియాక్షన్‌.. `రాకాస` టీజర్‌ ఎలా ఉందంటే