
నటనలో లోకనాయకుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ ఈ మధ్య సీక్వెల్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వరూపం మొదటి పార్ట్ తో మంచి హిట్ అందుకున్న కమల్ సీక్వెల్ లో మాత్రం ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇక శంకర్ దర్శకత్వంలో మరోసారి భారతీయుడి అవతావారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే శంకర్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. ప్రస్తుతం లొకేషన్స్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఇక భారతీయుడు 2 తో పాటు కమల్ 1992లో వచ్చిన తేవర్ మగన్.అనే సినిమాకు కూడా సీక్వెల్ సిద్ధం చేయాలనీ ఆలోచిస్తున్నాడట. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
తెలుగులో కూడా క్షత్రియపుత్రుడు పేరుతో రిలీజై సక్సెస్ అయ్యింది. పెద్దగా కోర మీసాలతో కనిపిస్తూ ఉరి పెద్దగా కమల్ ఆ సినిమాలో నటించిన విధానం ఎవ్వరు మర్చిపోలేరు. గ్రామ కక్ష్యలను చాలా రియాలిటీగా చూపించిన ఆ సినిమాకు భరతన్ దర్శకత్వం వహించారు. అయితే ఆయన 1996లో మరణించారు. మరి ఇప్పుడు సీక్వెల్ ను ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.