
కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ హక్కులను శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ సినిమా నుంచి రీసెంట్ గా సూర్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. సూర్య ఈ సినిమాలో సర్ ప్రైజ్ రోల్ లో నటించారు. ఫ్యాన్స్ ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోస్టర్ లో మాత్రం సూర్య చాలా డిఫరెంట్ గా కనిపించాడు. ఇక ఈసినిమాకు సంబంధించి తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కమల్ ఫ్యాన్స్. ఈ సినిమాను అభినందిస్తూ.. తమిళ యంగ్ హీరో.. ఎమ్మెల్యే.. సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ కూడా చేశారు.
ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో తెలుగు ఆడియన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు మూవీ టీమ్. టికెట్ రేట్లు.. అన్ని సినిమాలకంటే తక్కువరేట్లకే ఇస్తున్నట్టు ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో తెలంగాణలో 150 రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 147లుగా నిర్దేశించారు. మల్టీప్లెక్స్ దగ్గర కొస్తే తెలంగాణలో 195 రూపాయలు ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 177లుగా జీఎస్టీతో కలిపి నిర్దేశించారు. ధరల విషయంలో పెద్ద సినిమాల మాదిరిగా పెంచకుండా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు మేకర్స్.
ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరో సూర్య ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కమల్ సినిమా చేస్తుడటం, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి నటులు నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ కూడా గ్రాండ్ గా జరిగింది. కమల్ హాసన్ ను ఆకాశానికి ఎత్తాడు వెంకటేష్, కమల్ నటనను తాను అనుకరిస్తానన్నారు.అటు కమల్ కూడా సెటిల్డ్ గా మాట్లాడారు. నా కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు అని అన్నారు. వెంకటేష్ ను ఉద్దేశిస్తూ.. నా బ్రదర్ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు మర్మయోగి సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది అన్నారు. విక్రమ్ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా హిట్ మీ చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ లోకేశ్‌గారు నాలాగే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్ ఫిల్మ్స్... పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్. అది ప్రేక్షకులు సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్ చేయాలి అని అన్నారు కమల్.