Salaar: ‘సలార్‌’ పై నిర్మాత క్రేజీ అప్డేట్, ఫ్యాన్స్ ని ఆపటం కష్టం

Surya Prakash   | Asianet News
Published : Jun 02, 2022, 09:16 AM IST
Salaar: ‘సలార్‌’ పై నిర్మాత క్రేజీ అప్డేట్,  ఫ్యాన్స్ ని ఆపటం కష్టం

సారాంశం

 ప్రశాంత్‌ నీల్‌ - స్టార్ హీరో ప్రభాస్‌ కలయికలో రూపొందుతున్న ‘సలార్‌’ సినిమాపైనే ఉంది. ‘కె.జి.ఎఫ్‌’ తెరకెక్కించిన హోంబళే ఫిల్మ్‌  బ్యానర్ పైనే రూపొందుతోంది. 

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘కె.జి.ఎఫ్‌2’ విడుదలై  రికార్డ్‌ స్థాయి వసూళ్లతో సందడి చేసింది. ఇప్పుడు ఓటిటిలోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది. దాంతో  ఇప్పుడందరి దృష్టి ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ - స్టార్ హీరో ప్రభాస్‌ కలయికలో రూపొందుతున్న ‘సలార్‌’ సినిమాపైనే ఉంది. ‘కె.జి.ఎఫ్‌’ తెరకెక్కించిన హోంబళే ఫిల్మ్‌  బ్యానర్ పైనే రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ ‘కె.జి.ఎఫ్‌2’తో పాటే విడుదల కావొచ్చేమో అనే ప్రచారం సాగింది.  కానీ అలాంటిదేమీ  జరగలేదు. ఈ చిత్రం అప్డేట్స్ గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం నిర్మాత  విజయ్ కిరగందూర్ మీడియాతో మాట్లాడారు.

విజయ్ ఏమంటారంటే....ఈ సినిమా 35 శాతం షూటింగ్ పూర్తి అయిందని తెలియజేసారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రతి నెలా పదిహేను  రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది కాకుండా ప్రతి నెలా వారం రోజులు ఆయన అవసరం లేని సీన్స్ ని చిత్రీకరిస్తారు. అలాగే ‘సాలార్‌’ యాక్షన్‌ అత్యద్భుతంగా ఉంటుందని విజయ్‌ కిరగందూర్‌ హామీ ఇచ్చారు. యాక్షన్ గెటప్ లో ప్రభాస్‌ని చూడటం అతని అభిమానులకు ట్రీట్ అవుతుంది. అభిమానులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆయన తెలిపారు.

ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తుండగా, భువన్‌ గౌడ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై  ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మేకింగ్ కోసం భారీ బడ్జెట్‌ కేటాయించిన టీమ్ ఎక్కడా తగ్గేదేలే అంటోంది.  ఈ భారీ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ కూడా భాగం కాబోతున్నట్లు ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మునుపెన్నడూ చూడనంత హైలైట్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండటం మరింత ఇంట్రస్ట్ రేకెత్తిస్తోంది. 

సినిమాలో యాక్షన్‌కి తోడు గ్లామర్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. శ్రద్ద కపూర్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారట. ఇక ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యిన నేపధ్యంలో  ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు సలార్ మీదే ఆశ పెట్టుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఖచ్చితంగా సలార్ తో పెద్ద హిట్ కొడతాడని ఘంటాపధంగా చెప్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే