Vikram Trailer: `విక్రమ్‌` అరుదైన ఘనత.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ట్రైలర్‌.. కమల్‌ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌

Published : Apr 28, 2022, 01:41 PM ISTUpdated : Apr 28, 2022, 01:48 PM IST
Vikram Trailer: `విక్రమ్‌` అరుదైన ఘనత.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ట్రైలర్‌.. కమల్‌ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌

సారాంశం

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన `విక్రమ్‌` చిత్రం అరుదైన ఘనత సాధించబోతుంది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతుంది. 

యూనివర్సల్‌ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న చిత్రం `విక్రమ్‌`. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనసొంత బ్యానర్‌ అయిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైల్‌ స్టోన్‌ని చేరుకోబోతుంది. అరుదైన ఘనతని సాధించబోతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయబోతున్నారు. మే 18న కేన్స్ లో ఈ `విక్రమ్‌` చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అయితే కేన్స్ లో ట్రైలర్‌ విడుదల చేయబోతున్న తొలి ఇండియా చిత్రంగా `విక్రమ్‌` చరిత్ర సృష్టించబోతుంది. ఈ  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కమల్‌ సరికొత్త సంచలనాలకు తెరలేపారు. సినిమాని వరల్డ్ ఆడియెన్స్ కి రీచ్‌ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

``విక్రమ్‌` ఎన్‌ఎఫ్‌టీ, చిత్ర ట్రైలర్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లాంచ్‌ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విస్టావర్స్, లోటస్‌ మెటా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు` రాజ్‌కమల్‌ ఫిల్మ్ ప్రకటించింది. అంతేకాదు సినిమాని దేశ వ్యాప్తంగా ప్రమోట్‌ చేయబోతున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో దీన్ని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. పోలీస్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. 

75వ కేన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ పారిస్‌లో జరగబోతుంది. మే 17 న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవ వేడుక మే 28 వరకు 12 రోజులపాటు సాగుతుంది. ప్రపంచంలోని ఎంపిక చేయబడ్డ చిత్రాలు ఇందులో ప్రదర్శించబడతాయి. సినిమా కల్చర్‌ని విస్తరించడం, సినిమా రంగంలో వస్తున్న మార్పులను తెలిసేలా చేయడం, టాలెంట్‌ని వెలికితీయడం వంటి అంశాలతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. ఇందులో ఉత్తమ చిత్రానికి `పాల్మ డి ఓర్‌`(గోల్డెన్‌ పామ్‌) అవార్డుని అందిస్తారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు