
`హిందీ భాష ఇకపై జాతీయ భాష కాదు` అన్న కన్నడ సూపర్‌స్టార్ సుదీప్(Sudeep) వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్(Ajay Devgn) రియాక్షన్‌తో అది మరింత వివాదంగా మారింది. జాతీయ భాష అనేది వివాదంగా మారిపోయింది. ఇద్దరు స్టార్ల మధ్య కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. వీరి మధ్య ఉన్న వార్ తో అభిమానులు ఎవరీ హీరోను వారు పొగుడుతూ, సపోర్ట్ చేస్తూ ట్విటర్ లో పోస్ట్ లు పెతుడుతున్నారు.
ఈ సందర్భంగా బాలీవుడ్సట్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ను సపోర్ట్ చేస్తూ ఆయన అభిమానులు ట్విటర్ లో వరుస పోస్ట్ లు పెట్టారు. అయితే దేవగన్ గతంలో ‘సింగం’ చిత్రంలో నటించారు. దీంతో ఆయనకు మద్దుతు తెలిపేందుకు ఫ్యాన్స్ అసలైన హీరో ‘సింగం’ (#SinghamOurRealHero) అంటూ పోస్ట్ లు పెట్టారు. ఇది గమనించిన సూర్య ఫ్యాన్స్ ఈ వార్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారు.
అసలైన హీరో తమిళ స్టార్ సూర్య అంటూ తమిళ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. హిందీలో వచ్చిన సింగం తమిళ రీమేకే కదా అంటూ ట్వీట్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సూర్య సింగం చిత్ర పోస్టర్లను పోస్ట్ చేస్తూ ఇంటర్నెట్ లో రచ్చరచ్చ చేస్తున్నారు. సూర్యనే రియల్ సింగం అంటూ ట్వీట్ల ద్వారా తమ గళాన్ని లేవనెత్తారు. దీంతో ఇద్దరి స్టార్స్ మధ్య మొదలైన వార్ ఇలా రూట్ మార్చుకుంది. కిచ్చా సుదీప్ సౌత్ హీరో అయినందునే సూర్య ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారనే భావం నార్త్ అభిమానుల్లో నెలకొంది. మరోవిధంగా చెప్పాలంటే ఈ చిచ్చు సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టుగా కనిపిస్తోంది.
ఇంతకీ వివాదం ఎలా మొదలైందంటే.. ఉపేంద్ర హీరోగా రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న `ఆర్‌ః ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్` చిత్ర ప్రారంభోత్సవంలో కన్నడ స్టార్ సుదీప్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ రోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నాం, హిందీ ఇకపై జాతీయ భాష కాదు` అంటూ కామెంట్స్ చేశారు. ఇక్కడే లాంగ్వేజ్ చిచ్చు రాజుకుంది.