Avatar New Title : హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’ టైటిల్ అప్డేట్.. కొత్త టైటిల్ ఇదే..

Published : Apr 28, 2022, 12:10 PM IST
Avatar New Title : హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’ టైటిల్ అప్డేట్.. కొత్త టైటిల్ ఇదే..

సారాంశం

దశాబ్దానికి పైగా సినీప్రియులు ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘అవతార్ 2’. ఈ ఏడాది చివరల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లో మార్పులు చేసి తాజాగా కొత్త టైటిల్ ను ప్రకటించారు మేకర్స్.   

13 ఏండ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు అవార్ సీక్వెల్ వచ్చేస్తోంది. అవతార్ హీరో జేక్ ఈసారి తన భార్యా పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా థ్రిల్ చేయబోతున్నాడు. 2009లో వచ్చిన వరల్డ్ ప్రీమియర్ అవతార్ సీక్వెల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. కొవిడ్ కారణంగా మళ్లీ వాయిదా పడిన అవతార్ 2 2022 డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుంది. 

ఏకంగా 160 భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. ఏక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి అన్ని భాషల్లో ఈ భారీ చిత్రం విడుదల కాబోతుండగా అన్ బ్రేకబుల్ రికార్డ్ అనే చెప్పాలి. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను ఈరోజు సినిమాకాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ట్రైలర్ ను మే 6న రిలీజ్ కాబోతున్న ‘డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీవర్స్’తో కలిసి థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) తెలిపారు. 

అయితే ఈ చిత్రం సీక్వెల్‌తో సముద్ర గర్భంలోని మరో కొత్తలోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఆ అందమైన ఊహా లోకాన్ని కాన్సెప్ట్‌ ఆర్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రంపై అవతార్‌లు అందంగా నిర్మించుకున్న ఇళ్లు, సంద్రం లోపల వారు పక్షులపై ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ పోస్టర్లలో కనిపించాయి. అయితే 80 శాతం సినిమా సముద్రపు నీటిలోనే ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే టైటిల్ ను కూడా ఛేంజ్ చేశారు. అవతార్ 2గా ప్రచారంలో ఉన్నప్పటికీ ‘అవతార్ : ది వే ఆఫ్ ది వాటర్’గా అప్టేటెడ్ టైటిల్ ను లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.    

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి