భారతీయుడు2 సినిమా షూటింగ్ లో పెద్ద ట్విస్ట్, శంకర్ టీమ్ కు బ్రేక్ వేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.

Published : Jun 21, 2023, 11:07 AM IST
భారతీయుడు2 సినిమా షూటింగ్ లో పెద్ద ట్విస్ట్, శంకర్ టీమ్ కు బ్రేక్ వేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.

సారాంశం

భారతీయుడు2 షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. కమల్ హాసన్ కూడా సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలనే తపనతో ఉన్నాడు. సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఇండియన్2 షూటింగ్ కు సడెన్ బ్రేక్ పడింది. 

దాదాపు  ఇరవై ఏడేళ్ల క్రితం  సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త చరిత్రను సృష్టించింది  భారతీయుడు సినిమా.  బాక్సాఫీస్‌ దగ్గర బ్లాస్టింగ్ సక్సస్ ను తన ఖాతాలో వేసుకుంది. అప్పట్లోనే దాదాపు 50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది మూవీ. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ శంకర్ ఈసినిమాను తెరకెక్కించాడు.  అవినీతిని తట్టుకోలేని ఓ వృద్థుడు..మాజీ స్వతంత్ర సమరయోధుడు చేసిన పోరాట.. సరికొత్తగా ఆవిష్కరించాడు శంకర్. ఇక మళ్లీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ  శంకర్‌ డైరెక్షన్‌ లో.. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. 

అదేంటో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత నుంచి అన్నీ అవాంతరాలే.. ప్రతీసారి షూటింగ్ కు అంతరాయాలే.. ఇక అన్నీ సమస్యలు సమసిపోయి..  గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ తిరిగి స్టార్ట్అయ్యింది. ఇక అప్పటి నుంచి షూటింగ్ పరుగులు పెట్టించాడు శంకర్. ఎలాగోలా షూటింగ్ క్లైమాక్స్ కు తీసుకువచ్చాడు దర్శకుడు కాగా చివరి నిమిషంలో ఈమూవీషూటింగ్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరుపుగుంది. కాగా విమానాశ్రయంలో ఓ భారీ సీన్‌ చిత్రీకరిస్తుండగా ఏయిర్‌పోర్ట్‌ నిర్వాహాకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారట. ఇక చిత్రబృందం ఏయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు, డిపార్చర్‌ ఏరియాలో షూటింగ్‌ చేసుకోవడానికి మాత్రమే పర్మీషన్ పొందింది. కానీ లావటరీ ఏరియాలో షూటింగ్‌కు పర్మీషన్‌ లభించలేదు. అయినా గానీ అక్కడ షూటింగ్‌ చేయడంతో ఏయిర్‌పోర్ట్‌ నిర్వాహకులు అడ్డుకున్నారు. కాగా డిపార్చర్‌ ఏరియాలో పర్మీషన్‌ కోసం మూవీ టీమ్ ఏకంగా కోటీ ఇరవైనాలుగు లక్షలు చెల్లించిందట.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వచ్చే ఏాడాది జనవరి లో సంక్రాంతిని టార్గెట్‌ చేస్తూ.. సినిమా రిరలీజ్ చేయబెతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా మూవీ టీమ్ కదులుతుంది .   లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సిద్ధార్థ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వరాలు కంపోజ్‌ చేస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు