మొన్న విక్కీ కౌశల్, నిన్న హేమ శర్మ.. సల్మాన్ ఖాన్ వల్ల మరో నటికి అవమానం

Published : Jun 21, 2023, 09:07 AM IST
మొన్న విక్కీ కౌశల్, నిన్న హేమ శర్మ.. సల్మాన్ ఖాన్ వల్ల మరో నటికి అవమానం

సారాంశం

సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ అత్యాత్సాహం వల్ల మరో నటికి అవమానం జరిగింది. ఈమధ్యే బాలీవుడ్ యంగ్ స్టార్  విక్క కౌశల్ ను సల్మన్ సెక్యూరిటీ అవమానించిన సంఘటన మరువకముందే.. మరో ఘటన బయటకు వచ్చింది.   

బాలీవుడ్ లో వివాదాలు కోరి మరి కొనితెచ్చుకుంటుంటాడు సల్మాన్ ఖాన్. ఆయనే ఎన్నో వివాదాల్లో ఉన్నాడు నుకుంటే.. ఆయన చుట్టు ఉండే మంది.. మార్బలం వల్ల కూడా సల్మన్ మరికొన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈక్రమంలో.. కొన్ని రోజుల క్రితం .. యంగ్ స్టార్ విక్కీ కౌశల్ కు సల్మాన్ సెక్యురిటీ వల్ల అవమానం జరిగింది. సల్మాన్ ను కలవాలని ఎదరు చూస్తున్న విక్కీని పక్కకు తోసేశారు సల్మాన్ సెక్యూరిటీ.  ఆతరువాత అది వివాదం అవ్వడంతో.. సల్మాన్ స్వయంగా వెళ్ళి.. విక్కీని హగ్ చేసుకుని మరీ.. పలకరించాడు. ఇక తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మరోసారి బయటకువచ్చింది. 

ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా.. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. స్టార్ హీరో అయినా.. ఏదో ఒక సందర్భంలో అవమానాలు ఫేస్ చేయకతప్పదు. అలాంటివి ఎన్నో చూసి స్టార్ హోదాను సాధించిన వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ కు చెందిన ఓ నటి తను ఎదుర్కొన్న  అవమానం గురించి ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తూ.. మంచి నటిగా గుర్తింపు సాధించింది హేమశర్మ తన నటనతో గుర్తింపు పొందింది. 

రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గోంది. ఈ  ఇంటర్య్వూలో సంచలన విషయాలు వెల్లడించింది. ఫీల్డ్ లో తను అనుభవించిన బాధలు, అవమానాల గురించి వెల్లడించింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వల్ల తనకు జరిగిన అవమానం..  మనసులోని ఆవేదనను బయటపెట్టింది. సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు వెళ్లిన తనకు ఘోరమైన అవమానం జరిగిందని తెలిపింది. సల్మాన్ తో కలిసి  దబాంగ్ 3లో నటించిన హేమ శర్మ ఆ సినిమా షూటింగ్ సెట్ లో సల్మాన్ తో ఫొటో దిగేందుకు వెళ్లినప్పుడు ఆయన బాడీగార్డ్స్ కుక్కలా తరిమేశారని, సెట్లో వందల మంది ముదు అలా చేసేవరకు అంతా నవ్వుకున్నారని ఆవేదన చెందారు హేమ. దాంతో చాలా కాలం ఆఅవమానం గుర్తుకకు వచ్చి నిద్ర పట్టలేదున్నారు ఆమె. 

ఇక అటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గాని..అతని టీమ్ కాని ఈ విషయంలో స్పందించలేదు. ప్రస్తుతం ఆయన గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతనికి ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉండటంతో.. ప్రభుత్వం వై కేటగిరి బద్రతను సల్మాన్ ఖాన్ కు అందిస్తుంది. అంతే కాదు సల్మాన్ కూడా కొంత మంది ప్రైవేట్ వ్యాక్తులతో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.  ఇక సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 మూవీ కోసం మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?