లేటైనా లేటెస్ట్ గా.. బలగం చిత్రంపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు

Published : Jun 21, 2023, 09:52 AM IST
లేటైనా లేటెస్ట్ గా.. బలగం చిత్రంపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు

సారాంశం

ఈ ఏడాది టాలీవుడ్ అతి పెద్ద సర్ప్రైజ్ అంటే 'బలగం' చిత్రం అనే చెప్పాలి.అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించడం చూశాం. లేటుగా అయినా నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా బలగం చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 

ఈ ఏడాది టాలీవుడ్ అతి పెద్ద సర్ప్రైజ్ అంటే 'బలగం' చిత్రం అనే చెప్పాలి. ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా మాజీ జబర్దస్త్ హాస్య నటుడు వేణు దర్శకుడుగా ఇలాంటి చిత్రం ఒకటి తెరకెక్కిస్తున్నారు అని ఎవరికీ తెలియదు. తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు, పల్లెటూరి ప్రజలు.. మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాల్ని దర్శకుడు వేణు ఎల్దండి కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఈ చిత్రం చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులు అంటూ లేరు. 

ప్రతి గ్రామంలో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించేంతగా బలగం మూవీ ప్రజల్లోకి వెళ్ళింది. అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించడం చూశాం. దర్శకుడు వేణుని అభినందించారు. లేటుగా అయినా నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా బలగం చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 

బలగం చిత్రాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు చూశానో అర్థం కావడం లేదు. తెలుగు సినిమాకి దక్కిన మరో గౌరవంగా బలగం చిత్రాన్ని భావించాలి. ఇలాంటి చిత్రాన్ని అందించిన వేణు ఎల్దండి, దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటించిన ప్రియదర్శి, కావ్య.. కొమరయ్య, అతని కుటుంబ సభ్యులు అంతా నటనలో జీవించారు. మీ అందరికి నా ప్రేమ అని నాని ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. 

నాని ట్వీట్ కి ప్రియదర్శి, వేణు ఇద్దరూ స్పందించారు. వేణు థాంక్యూ నాని అన్నా అని రిప్లై ఇవ్వగా.. ఆలస్యం కాలేదు నాని అన్నా, థ్యాంక్యూ అని ప్రియదర్శి కామెంట్ చేశాడు. 

నేచురల్ స్టార్ నాని చివరగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రంలోనే నటించిన సంగతి తెలిసిందే. నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయంగా నిలిచింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు