`ప్రాజెక్ట్ కే` లో కమల్‌ హాసన్‌.. సంచలనానికి తెరలేపిన నాగ్‌ అశ్విన్‌.. ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Jun 25, 2023, 12:24 PM ISTUpdated : Jun 25, 2023, 01:20 PM IST
`ప్రాజెక్ట్ కే` లో కమల్‌ హాసన్‌.. సంచలనానికి తెరలేపిన నాగ్‌ అశ్విన్‌.. ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

`ప్రాజెక్ట్ కే`తో సంచలనాలకు తెరలేపుతున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమాకి కమల్‌ హాసన్‌ని తీసుకున్నారు. దీనిపై ప్రభాస్‌ రియాక్ట్ అయ్యారు. ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

ప్రభాస్ నటిస్తున్న భారీ మూవీ `ప్రాజెక్ట్ కే`. `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు. కీలక పాత్రలో ఇప్పటికే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. తాజాగా మరో సంచలన అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ చిత్రంలో మరో సూపర్‌ స్టార్‌ని భాగం చేస్తున్నారు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ `ప్రాజెక్ట్ కే`లో భాగం అవుతున్నారని ప్రకటించారు. కమల్‌ హాసన్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడిచింది. 

`భూమిని కప్పి ఉంచే నీడ మాకు కావాలి. అందుకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అతనే లోకనాయకుడు కమల్‌ హాసన్‌. ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌ `ప్రాజెక్ట్ కే`లో భాగం అవుతుండటం ఆనందంగా ఉంది` అంటూ ఓ స్పెషల్‌ గ్లింప్స్ ని విడుదల చేసింది యూనిట్‌. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమల్‌ని తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలకు అవదుల్లేవని చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతానికి ఇండియన్‌ సినిమాలో రూపొందుతున్న అతిపెద్ద సినిమాగా `ప్రాజెక్ట్ కే` అవతరించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు కమల్‌ ఫ్యాన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. కమల్‌ ఇటీవల `విక్రమ్‌` సినిమాతో కమ్‌ బ్యాక్‌ అయ్యారు. ఆయన `ఇండియన్‌ 2`వంటి భారీ సినిమాలను లైనప్‌లో పెట్టారు. ఈ క్రమంలో ఆయన ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమాని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నారు. టైమ్‌ పీరియడ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, చరిత్రకి, ప్రస్తుతానికి ముడిపెడుతూ సినిమాని తెరకెక్కిస్తున్నారట నాగ్‌ అశ్విన్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. 

ఈ సందర్భంగా ప్రభాస్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం అంటూ ఆయన ఎమోషనల్‌ వర్డ్స్ షేర్‌ చేసుకున్నారు. `ప్రాజెక్ట్ కేలో లెజెండరీ కమల్‌ హాసన్‌ సర్‌తో కలిసి పనిచేసేందుకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా ఉంది. అలాంటి సినిమా టైటాన్‌ లాంటి వ్యక్తితో కలిసి నేర్చుకునే, ఎదిగే అవకాశం వచ్చింది. నా కల నిజమైంది` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు ప్రభాస్. ఇది వైరల్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా