మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌కి కమల్‌ హాసన్‌ కార్‌ గిఫ్ట్.. వైరల్‌గా మారిన షర్మిలా వివాదం

Published : Jun 26, 2023, 11:13 PM IST
మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌కి కమల్‌ హాసన్‌ కార్‌ గిఫ్ట్.. వైరల్‌గా మారిన షర్మిలా వివాదం

సారాంశం

ఇటీవల బస్సు డ్రైవర్‌గా జాబ్‌ కోల్పోయిన మహిళా బస్సు డ్రైవర్‌ని కమల్‌ హాసన్‌ ఆదుకున్నారు. ఆమెకి కారు గిఫ్ట్ గా ఇచ్చి అభినందించారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌ అవుతుంది.

కోయంబత్తూరు(తమిళనాడు)లో మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌కి కమల్‌ హాసన్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆమె ఇటీవల జాబ్‌ని కోల్పోవడంతో విషయం తెలుసుకున్న కమల్‌.. ఆమెని తన ఆఫీస్‌కి పిలిపించి కారుని బహుకరించారు. కారుని ట్యాక్సీగానే కాకుండా ఇతర అవసరాలకు వాడుకుని గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలని ఈ సందర్భంగా కమల్‌ ఆకాక్షించారు.  మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా తమిళనాట పాపులర్‌ అయిన కోయంబత్తూరుకి చెందిన షర్మిలా ఇటీవల ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన బస్సుకి డ్రైవర్‌గా పనిచేస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న డీఎంకే ఎంపీ కనిమొళి తాను కోవైలో పర్యటించినప్పుడు షర్మిలా డ్రైవ్‌ చేస్తున్న బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో కండక్టర్ ఎంపీకి టికెట్‌ ఇచ్చారు. ఎంపీకి టికెట్‌ ఇవ్వడం పట్ల షర్మిలా అభ్యంతరం తెలిపారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో, కండక్టర్‌ కూడా షర్మిలాపై కంప్లెయింట్‌ చేసింది. పాపులారిటీ కోసం సెలబ్రిటీలను బస్సుల్లోకి ఫ్రీగా ఎక్కించుకుంటుందని ఆరోపించారు. దీంతో ఆ యాజమాన్యం షర్మిలాని జాబ్‌ నుంచి తొలగించారు. 

దీంతో ఈ విషయం తమిళనాట పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇది బాగా వైరల్ గా మారింది. ఈ విషయం కమల్‌ హాసన్‌ వరకు వెళ్లింది. దీంతో ఆయన కలత చెంది, ఆమెకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఎంఎన్‌ఎం ఆఫీసుకి పిలిపించారు. ఆమెకి కొత్త కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ, కోయంబత్తూర్‌ తొలి మహిళ బస్సు డ్రైవర్‌ షర్మిలా జాబ్‌ కోల్పోవడం తనని ఎంతో బాధించిందని చెప్పారు. యువతకు ఆమె ఎంతో స్పూర్తిగా నిలిచారని, షర్మిల కేవలం డ్రైవర్ గానే మిగిలిపోకుండా, ఎంతో మంది షర్మిలలను సృష్టించాలని కోరుకున్నారు కమల్‌. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున షర్మిలకు కారును అందజేస్తున్నట్లు తెలిపారు. కేవలం క్యాబ్ సర్వీసులకే పరిమితం కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించాలని, పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ఈ కారును వినియోగించుకోవచ్చని కమల్ హాసన్ పేర్కొన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా