టికెట్‌ రేట్లు తగ్గిస్తే ఇంత రచ్చా.. `ఆదిపురుష్‌`పై పేలుతున్న సెటైర్లు.. కలెక్షన్ల డిటెయిల్స్

Published : Jun 26, 2023, 07:21 PM ISTUpdated : Jun 26, 2023, 07:36 PM IST
టికెట్‌ రేట్లు తగ్గిస్తే ఇంత రచ్చా..  `ఆదిపురుష్‌`పై పేలుతున్న సెటైర్లు.. కలెక్షన్ల డిటెయిల్స్

సారాంశం

ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు `ఆదిపురుష్‌` టీమ్‌ కొత్త ఎత్తుగడ వేసింది. టికెట్‌ రేట్లని తగ్గించింది. 3డీ టికెట్ రేట్లని రూ.112కి చేసింది. దీనిపై నెటిజన్ల నుంచి విచిత్రమైన స్పందన వస్తోంది.

`ఆదిపురుష్‌` సినిమా పది రోజులకు చేరుకుంది. మొదటి మూడు రోజుల్లో హవా సాగించింది. ఆ తర్వాత డల్‌ అయ్యింది. రెండో వారం మొత్తంలో కేవలం వంద కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం 450 కోట్ల(గ్రాస్‌)కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగానే వసూలు చేసింది. సుమారు 85కోట్ల నెట్‌ రాబట్టుకోవడం విశేషం. బిజినెస్‌లో కేవలం 60శాతం కలెక్షన్లని మాత్రమే ఇది రికవరీ చేసుకుంది. దీంతో ప్రస్తుతం `ఆదిపురుష్‌` సినిమా ఫ్లాప్‌ జాబితాలోకే వెళ్లబోతుందనిపిస్తుంది. 

ఇదిలా ఉంటే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు `ఆదిపురుష్‌` టీమ్‌ కొత్త ఎత్తుగడ వేసింది. టికెట్‌ రేట్లని తగ్గించింది. 3డీ టికెట్ రేట్లని రూ.112కి చేసింది. అంతకు ముందు 150 చేసింది. కానీ పెద్దగా స్పందన లేదు. దీంతో ఇప్పుడు కాస్త లేట్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ సోమవారం నుంచి రూ.112కి టికెట్‌ రేట్లు తగ్గించినట్టు వెల్లడించింది. జనరల్‌గా టికెట్‌ రేట్లు తగ్గించారంటే ఆడియెన్స్‌ హ్యాపీగా ఫీలవ్వాలి. కానీ అందుకు భిన్నమైన స్పందన వస్తుంది. ఫ్రీగా చూపించినా సినిమా చూడమంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.

`ఫ్రీగా చూపించిన సినిమా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నారు. 1రూపాయి చేసినా చూడమని, మాకు ఎదురుగా డబ్బులిచ్చి సినిమా చూపించినా చూడమని, హిందూ మనోభావాలతో దర్శకుడు ఓం రౌత్‌ ఆడుకున్నాడని, రామాయణాన్ని కామెడీ చేశారని అంటున్నారు. సినిమాకెళ్లి హెడెక్‌ కంటే ఇంట్లోనే ఉండటం బెటర్‌ అంటున్నారు. టీజర్‌ టైమ్‌లోనే సినిమాని ఏం చేశారో అర్థమయ్యిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ ప్రొడక్షన్‌ హౌజ్‌ని ఆడుకుంటున్నారు. దీంతో ఇది నెట్టింట రచ్చ చేస్తుంది. 

`ఆదిపురుష్‌` టీమ్‌ లేట్‌గా రియాక్ట్ అయ్యిందని, వీకెండ్‌ తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది అని, జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు రియాక్ట్ అయితే లాభం లేదంటున్నారు. అంతకు ముందు కూడా సినిమా రైటర్‌ తాము తీసింది `రామాయణం` కాదని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేశామని తెలిపారు. నేటి యువతకి అర్థమయ్యేలా చేశామన్నారు. అదే విషయం ముందు నుంచి ఆడియెన్స్ ని ప్రీపేర్‌ చేస్తే ఇంతటి విమర్శలు, ఇంతటి ట్రోల్స్ జరిగేది కాదని, ఇంతటి నష్టం జరిగేది కాదని అంటున్నారు. ఇప్పుడు టికెట్‌ రేట్ల విషయంలోనూ టీమ్‌ అదే మిస్టేక్‌ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే `ఆదిపురుష్‌` సినిమాకి విడుదలైన మొదటి షో నుంచి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. భారీ ట్రోలింగ్‌ నడిచింది. హిందుత్వ వాదులు సైతం విమర్శలు చేశారు. పూజారులు సినిమాని బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. పాజిటివ్‌ కంటే నెగటివిటీ ఎక్కువ జరిగింది. విపరీతమైన నెగటివిటీ మధ్య కూడా ఈ చిత్రం తొలి రోజు 140కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లో 340కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఆల్మోస్ట్ డిజాస్టర్‌ టాక్‌తో ఇప్పుడు 450కోట్లు రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదు, అది కేవలం ప్రభాస్‌ ఇమేజ్‌, రామాయణం ఎఫెక్ట్ తోనే సాధ్యమైంది. ఇది మరే హీరోకి సాధ్యం కాదనేది క్రిటిక్స్ చెప్పే మాట. 

ఇక `ఆదిపురుష్‌` చిత్రంలో రాముడిగా ప్రభాస్‌ నటించగా, సీతగా కృతి సనన్‌ నటించింది. రావణ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించారు. ఓం రౌత్‌ రూపొందించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ నిర్మించింది. జూన్‌ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?