
ఈ మద్య వెండితెర, బుల్లితెరకు సబంధించిన సెలబ్రిటీలు అకాలమరణంచెందడం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో బుల్లితెర స్టార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బుల్లితెర సెలబ్రిటీ దేవరాజ్ పటేల్ రాయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్త తెలిసి ఆయన ఫాలోవర్లు.. ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. స్టార్ సెలబ్రిటీలు కూడా దేవరాజ్ మరణ వార్త తెలిసి దిగ్ర్బాంతికి లోనయ్యారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ దేవరాజ్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు “మనందరినీ నవ్వించి.. “దిల్ సే బురా లగ్తా హై”తో కోట్లాది మంది ప్రజల మధ్య తన స్థానాన్ని సంపాదించుకున్న దేవరాజ్ పటేల్ ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టాడు.ఈ చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి" అని ఆయన తన ట్వీట్‌లో దేవరాజ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి.
రాయ్‌పూర్‌లోని లభండిహ్ సమీపంలో దేవరాజ్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు అతని బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరాజ్ స్నేహితుడు బైక్ నడుపుతుండగా.. దేవరాజ్ వెనకాలు కూర్చున్నాడు. ఇక ఈ ప్రమాదంలో స్టార్ కమెడియన్ అక్కడికక్కడే మరణించగా.. అతని స్నేహితుడికి గాయలు అయినట్టు తెలుస్తోంది.
దేవరాజ్ తన యూట్యూబ్ ఛానెల్ బో బాగా ఫేమస్ అయ్యారు ఆయణ ఛానల్ కు దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దేవరాజ్ వీడియోలు లక్షల్లో వ్యూస్ ను సాధిస్తాయి. ఇన్ స్టా లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో కూడా దేవరాజ్ ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ఇక దేవరాజ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ స్టా రీల్స్ తో పాటు.. దిండోరాలో నటించాడు. ఇందులోని దిల్ సే బురా లగ్తా హై భాయ్ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.