ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు

pratap reddy   | Asianet News
Published : Nov 22, 2021, 04:09 PM IST
ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు

సారాంశం

కరోనా మహమ్మారి పూర్తిగా మానవాళిని విడిచిపెట్టడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కోవిడ్ కి గురవుతుండడం చూస్తూనే ఉన్నాం.

కరోనా మహమ్మారి పూర్తిగా మానవాళిని విడిచిపెట్టడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కోవిడ్ కి గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ వార్త కమల్ అభిమానులని కలవరపెడుతోంది. 

కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ యూఎస్ వెళ్లారు. తన సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభోత్సవానికి యుఎస్ వెళ్లారు. తిరిగి వచ్చాక దగ్గు మొదలైంది. దీనితో లక్షణాలు అనుమానాస్పదంగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కమల్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని తేల్చారు. 

దీనితో కమల్ హాసన్ కు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తన ఆరోగ్య పరిస్థితిపై కమల్ హాసన్ స్వయంగా ట్వీట్ చేశారు. అమెరికా నుంచి వచ్చాక దగ్గు వచ్చింది. పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. దీనితో చికిత్స తీసుకుంటున్నాను. ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని కమల్ ట్వీట్ చేశారు. కమల్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చేనవలసిన అవసరం లేదని.. ప్రస్తుతం కమల్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంఎన్ఎం పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. 

Also Read: బాలీవుడ్ నటుడి భార్య కంత్రీ పనులు, వారితో బెడ్ పై నగ్నంగా.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

కమల్ కి కరోనా సోకడంతో కొంత కాలం ఆయన ఐసోలేషన్ లో ఉండాలి. ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 5 కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ తమిళ్ 5 కి ఎవరు టెంపరరీ హోస్ట్ గా  వ్యవహరిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఇదిలా ఉండగా కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: టీనేజ్ పిల్లలా తుళ్లిపడుతున్న 34 ఏళ్ళ బ్యూటీ.. క్లీవేజ్ అందాలతో జెనీలియా రచ్చ

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!