Jersey Trailer: హిందీ జెర్సీ ట్రైలర్ వచ్చేస్తుంది

Published : Nov 22, 2021, 01:25 PM ISTUpdated : Nov 22, 2021, 01:26 PM IST
Jersey Trailer: హిందీ జెర్సీ ట్రైలర్ వచ్చేస్తుంది

సారాంశం

జెర్సీ ట్రైలర్(Jersey Trailer) విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ నేడు అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 23 సాయంత్రం 5:30 నిమిషాలు జెర్సీ ట్రైలర్ విడుదల కానుంది. 


నాని (Nani)కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది జెర్సీ చిత్రం. యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా జెర్సీ తెరకెక్కింది. క్రికెటర్ రోల్ లో నాని తన సహజ నటనతో అబ్బురపరిచారు. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించారు. జాతీయ అవార్డ్స్ వేదికపై జెర్సీ సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఎడిటింగ్ విభాగాలలో రెండు అవార్డ్స్ కొల్లగొట్టింది. 


ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు హిందీలో నిర్మిస్తున్నారు. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా షాహిద్ కపూర్(Shahid kapoor) హీరోగా చేస్తుండగా, మృణాళి ఠాకూర్ హీరోయిన్ నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్  కొంత కాలం ఆగిపోయింది. అలాగే షూటింగ్ లో షాహిద్ గాయాలపాలు కావడం జరిగింది. 

అనేక ప్రతికూలతల మధ్య జెర్సీ షూటింగ్ జరిపారు.కాగా జెర్సీ ట్రైలర్(Jersey Trailer) విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ నేడు అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 23 సాయంత్రం 5:30 నిమిషాలు జెర్సీ ట్రైలర్ విడుదల కానుంది. దిల్ రాజు తన అధికారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ అప్డేట్ ఇచ్చారు. 

Also read Samantha : గోవాలో వాళ్ళిద్దరితో సమంత!


ఇక అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రంతో కెరీర్ లో అతిపెద్ద హిట్ కొట్టాడు షాహిద్. మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం షాహిద్ కి తిరుగులేని విజయాన్ని అందించింది. అర్జున్ రెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ కూడా తెరకెక్కించారు. జెర్సీ విషయంలో కూడా షాహిద్ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. మరి ఈమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

Also read అబ్బురపరిచే సెట్ లో సమంత అందాల విందు.. ఐటమ్ సాంగ్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?
Nivetha Pethuraj పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఇదేం ట్విస్ట్