Bigg boss telugu 5: కాజల్, సన్నీ ఫ్యాన్స్ కి కమెడియన్ సుదర్శన్ క్షమాపణలు

Published : Nov 22, 2021, 03:49 PM IST
Bigg boss telugu 5: కాజల్, సన్నీ ఫ్యాన్స్ కి కమెడియన్ సుదర్శన్ క్షమాపణలు

సారాంశం

ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఓ అపార్ధం చోటుచేసుకుంది. అనుభవించు రాజా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ కాషిష్ ఖాన్, కమెడియన్ సుదర్శన్ షోకి  రావడం జరిగింది. కాగా సుదర్శన్ చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిపై సుదర్శన్ పంచులు వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సన్నీతో  కొంచెం ఎక్కువగా ఆడుకున్నాడు. హౌస్ లో ఫైర్ అవుతున్నానని సన్నీ అనుకుంటున్నాడు, కానీ అతడు చేసేది అంతా కామెడీ అని పంచ్ వేశాడు. దానికి థాంక్స్ బ్రదర్ అని సన్నీ అనగా.. పొగిడాను అనుకుంటున్నాడు అంటూ మరో పంచ్ విసిరాడు. 


అనంతరం సన్నీ ఫ్రెండ్ కాజల్ పై మరింత దారుణమైన పంచెస్ వేశాడు. కాజల్ మీరు బాగా  ఆడుతున్నారు. ఏడుస్తున్నప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది. సన్నీ వచ్చి నిన్ను హగ్ చేసుకోవడం, ఆ రొమాన్స్ బాగుంటుంది అన్నాడు. అంతటితో ఆగకుండా వాళ్ళ రొమాన్స్ ని షణ్ముఖ్ సిరిల రొమాన్స్ తో పోల్చాడు. ఈ కామెంట్స్ తో షాక్ తిన్న సన్నీ వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమది బ్రదర్ సిస్టర్ రిలేషన్ అంటూ తెలియజేశాడు. 

Also read Anee master Eliminated: రవిపై జోస్యం చెప్పిన అనీ మాస్టర్.. శ్రీరామ్‌ బ్రదర్‌ అంటూ సిరిపై హాట్‌ కామెంట్‌
అయితే కమెడియన్ సుదర్శన్ వ్యాఖ్యలు సన్నీ, కాజల్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేశాయి. అలాంటి కామెంట్స్ కుటుంబ సభ్యులను ఎంతగా బాధపెడతాయంటూ.. సుదర్శన్ ని సోషల్ ఇండియాలో ఏకి పారేస్తున్నారు. తన కామెంట్స్ కొందరిని హర్ట్ చేశాయని తెలుసుకున్న సుదర్శన్ వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. మా మధ్య జరిగిన డిస్కషన్ లో ఎడిట్ చేసి కొంతే చూపించారు. ఈ విషయంపై మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా నా కామెంట్స్ కొందరిని బాధపెట్టాయి. అందుకే సన్నీ, కాజల్ కుటుంబ సభ్యులకు, ఫ్యాన్స్ కి సారీ చెబుతున్నా అంటూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు. 

Also read Biggboss telugu 5: ప్రియ ఇంట పెళ్లి సందడి హాజరైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా