బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోంది.. తారకరత్న హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

By Asianet News  |  First Published Feb 10, 2023, 1:08 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న (Taraka ratna) హెల్త్ పై హీరో కళ్యాణ్ రామ్ తాజాగా అప్డేట్ అందించారు. ప్రస్తుతం బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోందని పలు విషయాలు తెలిపారు. 
 


తెలుగుదేశం పార్టీ గతనెలలో కుప్పం నుంచి నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే కుప్పంలో ట్రీట్ మెంట్ అందించారు. అప్పటికే గుండెపోటుకు గురైనట్టు గుర్తించి చేయాల్సిన చికిత్స చేశారు. ఇక మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ  హ్రుదయాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు క్షణక్షణం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

బాలయ్య, కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడూ తారకరత్న ఆరోగ్యంపై వైద్యులను ఆరాతీస్తూనే ఉన్నారు. చికిత్స స్పందిస్తున్నారని తెలిపారు. అయినా ఇంకా క్రిటికల్ స్టేజీలోనే ఉన్నారన్నారు. పదిరోజులకు పైగా చికిత్స పొందుతున్న తారకరత్న హెల్త్ పై తాజాగా హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) స్పందించారు. ఆయన నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇవ్వాళ గ్రాండ్ గా నిర్వహించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంరాక్ట్ అయిన సందర్భంలో తారకరత్న హెల్త్ అప్డేట్ పై ప్రశ్న ఎదురైంది. 

Latest Videos

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..  తారకరత్నకు బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోంది. డాక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. త్వరలో కోలుకుంటారని భావిస్తున్నాను. ఈమేరకు దేవుడిని ప్రార్థిస్తున్నాం. తారకరత్న హెల్త్ పై డాక్టర్లు అప్డేట్ ఇస్తే బాగుంటుంది. మీ అందరి ఆశీస్సులతో కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నాం.’ అని వివరించారు.  కొద్దిరోజులుగా తారకరత్న హెల్త్ అప్డేట్ రాలేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించనున్నామని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తారకరత్న ఎలా ఉన్నారనేది తెలియాల్సి ఉంది. 

 

click me!