Bigg Boss Telugu 5: రవి ఎలిమినేటెడ్.. వెక్కి వెక్కి ఏడ్చిన సన్నీ, కాజల్ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్

pratap reddy   | Asianet News
Published : Nov 29, 2021, 08:04 AM IST
Bigg Boss Telugu 5: రవి ఎలిమినేటెడ్.. వెక్కి వెక్కి ఏడ్చిన సన్నీ, కాజల్ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకోవడంతో ఊహించని మలుపులతో రసవత్తరంగా మారింది. రవి తప్పకుండా టాప్ 5 లో ఉంటాడని అభిమానులంతా ఆశించారు. కానీ అనూహ్యంగా యాంకర్ రవి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకోవడంతో ఊహించని మలుపులతో రసవత్తరంగా మారింది. రవి తప్పకుండా టాప్ 5 లో ఉంటాడని అభిమానులంతా ఆశించారు. కానీ అనూహ్యంగా యాంకర్ రవి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 5లో రవి ప్రధాన కంటెస్టెంట్ గా కొనసాగుతూ వచ్చాడు. రవికి సపోర్ట్ చేసే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. 

12వ వారం నామినేషన్స్ లో చివరకు Kajal, Ravi మిగిలారు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ప్రీ పాస్ ఉంది. తన వద్ద ఉన్న ఎవిక్షన్ ప్రీ పాస్ ని సన్నీ కాజల్ కోసం ఉపయోగించాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సన్నీ కాజల్ కి ఎవిక్షన్ ప్రీ పాస్ ఇవ్వకున్నా ఆమె సేవ్ అయ్యేది. రవి కంటే కాజల్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున అన్నారు. సన్నీ ఎవిక్షన్ ప్రీ పాస్ ని రవి కోసం ఉపయోగించి ఉంటే అతడు సేవ్ అయి ఉండేవాడని నాగ్ తెలిపారు. 

రవి ఎలిమినేట్ అయ్యాక సన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సన్నీ ఎవిక్షన్ ప్రీ పాస్ పొందడంలో కాజల్ అతడికి సాయం చేసింది. అందుకు కృతజ్ఞతగానే సన్నీ ఆమె కోసం ఎవిక్షన్ ప్రీ పాస్ ఉపయోగించాడు. రవి ఎలిమినేట్ కావడంతో అతడు హౌస్ నుంచి బయటకు వెళ్లక తప్పలేదు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులకు కూడా ఊహించని షాక్. ప్రతి ఒక్కరి ముఖాలు వాడిపోయాయి. 

ఇక వేదికపైకి వెళ్ళాక రవి తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అనేది చెప్పాలని నాగ్ రవిని అడిగారు. తాను హౌస్ లో తొలి నుంచి షణ్ముఖ్ తో కనెక్ట్ అయ్యానని, అతడు పాస్ అని రవి తెలిపాడు. శ్రీరామ చంద్ర పాజిటివ్ గా ఉంటాడు. అతడు కూడా పాస్. సన్నీ హౌస్ లో తోపు అని రవి అభివర్ణిస్తూ అతడిని పాస్ చేశాడు. 

ప్రియాంక, మానస్, కాజల్ ఫెయిల్ అని రవి ప్రకటించాడు. భావోద్వేగాల నడుమ రవి హౌస్ ని వీడాల్సి వచ్చింది. టాస్క్ లలో రవి చాలా యాక్టివ్ గా ఉంటాడు. స్ట్రాటజీలు అప్లై చేయడంలో రవి దిట్ట అంటూ నాగార్జున అతడిని ఆట పట్టిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇక రవి, ప్రియా మధ్య జరిగిన సంఘటన ఈ సీజన్ లో అతిపెద్ద వివాదంగా అభివర్ణించవచ్చు. లహరి, రవి లపై ప్రియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తనపై నిండా వేసిన ప్రియాకు అవి గట్టిగానే బదులిచ్చాడు. కానీ చివరకు ఆ విషయంలో రవి వైపు కూడా తప్పు ఉన్నట్లు తేలింది. 

Also Read: Bigg Boss Telugu 5: సన్నీ Vs షణ్ముఖ్.. శృతి మించిపోయిన ఫ్యాన్స్ వార్, చేతులు జోడించి వేడుకుంటోంది

Also Read: Shiva Shankar: విధిని ఎదిరించిన శివశంకర్ మాస్టర్.. వెన్నెముక విరిగినా జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా..

PREV
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌