
బాలయ్యతో సినిమాకు రెడీ అవుతున్నాడు యంగ్ డైరెక్టర్. ఇప్పటికే బాలకృష్ణతో సినిమా చేయడానిక ఇద్దరు దర్శకులు క్యూలో ఉండగా.. ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంతకీ బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడు...?
వరుస సినిమాలతో జోరుమీద ఉన్న బలకృష్ణ.. వరుసగా డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాతో అఖండ విజయం సాధించిన బాలయ్య.. ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ బాలయ్య ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సినిమాపై బారీగా హైప్ పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ ను కూడా సస్పెన్స్ లో పెట్టడంతో.. టైటిల్ ఏమిస్తారా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక బాలయ్య నెక్ట్స్ మూవీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మలినేనితో సినిమా తరువాత బాలయ్యతో సినిమా చేయడానికి అటు అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. తరువాత పూరీ జగన్నాథ్ తో కూడా మూవీ ఉంది. అటు బోయపాటి కూడా మరోసారి సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యలోమరో కొత్త దర్శకుడు బాలయ్యతో సినిమాకు లైన్ లోకి వచ్చాడే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార దర్శకుడు వశిష్ట బాలయ్యకోసం కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది.
బింబిసార సినిమాతో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు దర్శకుడు వశిష్ఠ. తొలి సినిమా అయినా కూడా బింబిసారను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంది. కాగా ఈ డైరెక్టర్‌ను బాలయ్య నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు తీసుకోవాలని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో చేస్తున్నప్పుడు గీతా ఆర్ట్స్‌తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది. దాంతో అప్పటి నుంచి మంచి దర్శకుడి కోసం గీతాఆర్ట్స్ ఎదురు చూస్తోంది.
అయితే ఇంతకాలం ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే బాధ్యతలను ఎవరికి ఇవ్వాలా అని గీతా ఆర్ట్స్ ఎదురుచూస్తున్న తరుణంలో.. బింబిసార వంటి ప్రెస్టీజియస్ మూవీని రూపొందించిన వశిష్ఠ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని వారు భావిస్తున్నారట. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బింబిసార చిత్రంతో సత్తా చాటిన వశిష్ఠ, బాలయ్య కోసం ఎలాంటి కథను పట్టుకొస్తాడో చూడాలి అంటున్నారు నందమూరి అభిమానులు. మరి బాలయ్యతో సినిమాకోసం రెడీగా ఉన్న అనిల్ పరిస్థితి ఏంటీ..? అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. అపీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.