
ప్రభాస్ నుంచి ప్రతిష్టాత్మక మూవీ `కల్కి2898ఏడీ` రాబోతుంది. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీ భారీ స్కేల్‌లో రూపొందుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. భవిష్యత్ కాలాన్ని ప్రతిబింబించేలా ఈ మూవీ రూపొందుతుంది. అంతేకాదు ఇందులో పలు పురాణాలకు సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నాయట. టైమ్ ట్రావెల్ తరహాలో నాగ్ అశ్విన్ ఈ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
దీనికితోడు ఇందులో నటిస్తున్న భారీ కాస్టింగ్ కూడా సినిమాపై హైప్‌ని పెంచేస్తుంది. ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రానా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. అలాగే దీపికా పదుకొనె, దిశా పటానీలతోపాటు మృణాల్ ఠాకూర్ కూడా మెరవబోతుంది. ఇలా ఈ కాస్టింగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. అన్ని కుదిరితే ఈ చిత్రం మే 9న విడుదల కాబోతుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కంప్లీట్ అయితే అనుకున్న టైమ్‌కి వస్తుంది, లేదంటే వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం అదే డేట్‌కి రిలీజ్ చేసేందుకు శ్రమిస్తున్నారు.
`కల్కి2898ఏడీ` మూవీకి సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా ప్రారంభమయ్యాయి. టీమ్ ఇండియా, ఓవర్సీస్‌లో భారీగా డిమాండ్ చేస్తుంది. తెలుగులో 200కోట్ల బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. నైజాంలో 70-75 వరకు పలుకుతున్నట్టు సమాచారం. అలాగే ఆంధ్రాలో 130కోట్ల డిమాండ్ నడుస్తుందట. మరోవైపు ఓవర్సీస్‌లోనూ గట్టిగానే వినిపిస్తుంది. అక్కడ కూడా వంద కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తుంది. ఇలా అన్ని ఏరియాల్లోనూ రికార్డు ప్రైజ్ వినిపిస్తుంది.
ఇప్పుడు నార్త్ (హిందీ)రైట్స్ సైతం షాకిస్తున్నాయి. ఈ మూవీని నార్త్ బెల్ట్ లో 135కోట్లు డిమాండ్ చేస్తున్నారట మేకర్స్. ఈ మొత్తాన్ని కోట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలకంటే ఎక్కువ. `ఆర్‌ఆర్‌ఆర్`ని 140కోట్ల వరకు అమ్మేశారు. కాకపోతే అది శాటిలైట్స్ రైట్స్ కలిపి ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం థియేట్రికల్ రైట్సే 135కోట్లు అడుగుతున్నట్టు సమాచారం. మరి బయ్యర్ల నుంచి ఎలాంటి స్పందన ఉందనేది తెలియాల్సి ఉంది. ఇలా ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలోనే ఈ మూవీకి 500-600కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే నిర్మాతలకు రిలీజ్‌కి ముందే ప్రాఫిట్‌లో ఉన్నారని చెప్పొచ్చు. 500కోట్ల బడ్జెట్‌తో ఈమూవీని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
Read more: శ్రీలీలకి ఉన్న ఆశ అదొక్కటే.. నిలబెడుతుందా? ముంచుతుందా?