విజయ్ రాజకీయాల్లోకి.. లియో సీక్వెల్ సాధ్యమేనా, లోకేష్ కనకరాజ్ లేటెస్ట్ కామెంట్స్

Published : Feb 18, 2024, 05:18 PM IST
విజయ్ రాజకీయాల్లోకి.. లియో సీక్వెల్ సాధ్యమేనా, లోకేష్ కనకరాజ్ లేటెస్ట్ కామెంట్స్

సారాంశం

దళపతి విజయ్ నటించిన లియో చిత్రం గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని మించే స్థాయిలో లేనప్పటికీ పర్వాలేదనిపించింది.

దళపతి విజయ్ నటించిన లియో చిత్రం గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని మించే స్థాయిలో లేనప్పటికీ పర్వాలేదనిపించింది. విజయ్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్ము లేపింది. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రిష కథానాయికగా నటించగా యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. 

ఈ చిత్రం విడుదలైన తర్వాత సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు లోకేష్ ప్రకటించారు. అయితే ఊహించని విధంగా హీరో విజయ్ పాలిటిక్స్ తో బిజీ కాబోతున్నారు. ఆయన పార్టీ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

విజయ్ కి ఇదే చివరి చిత్రం అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. తదుపరి చిత్రాలకు విజయ్ సైన్ చేయడం లేదని తెలుస్తోంది. దీనితో లియో పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలయింది. దీనిపై డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. 

లియో చిత్రానికి సీక్వెల్ చేయాలని ఉంది. కానీ ఆయన ఆశయాలు వేరుగా ఉన్నాయి. విజయ్ ఒప్పుకుంటే లియో సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. అయితే విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లాలనే నిర్ణయాన్ని తాను అభినందిస్తునట్లు లోకేష్ తెలిపారు. అన్నీ అనుకూలిస్తే లియో సీక్వెల్ ఉంటుందని అన్నారు.లియో సెకండ్ హాఫ్ పై వచ్చిన విమర్శలు తన దృష్టికి కూడా వచ్చినట్లు లోకేష్ అన్నారు. భవిష్యత్తులో తన చిత్రాల్లో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా