
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) ఈ సారి మాత్రం థియేటర్లో హిట్ కొట్టేందుకు పుష్పక విమానం అంటూ రాబోతోన్నాడు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు.గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన హీరోయిన్ ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్(Allu arjun) విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. కానీ అతని భార్యను మాత్రం ఎవ్వరికీ చూపించడు. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తాడు. హోటళ్లు నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినతన భార్య చేసిందని స్కూల్‌లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు.అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. కానీ అసలు తన భార్య ఉండదు. పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఇక ఈ విషయంలో అతడి చుట్టూ పోలీసులు తిరుగుతుంటారు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా? అని పోలీస్ కారెక్టర్‌లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది.
‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది.’’ అని దర్శక-నిర్మాతలు చెప్పుకొచ్చారు. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్, నరేశ్, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
also read: రెబల్‌స్టార్‌కి బ్రహ్మానందం సర్‌ప్రైజ్.. ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసిన కృష్ణంరాజు