
తెలుగు హీరోయిన్స్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న వాళ్లలో కాజల్ అగర్వాల్ ముందుంటుంది. దశాబ్ద కాలంగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించి తొలి సినిమాతోనే ఎక్కడికో వెళ్తుంది అనిపించుకుంది. అలా దశాబ్ద కాలంగా మగధీర, ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ సరసన కూడా నటించిన హీరోయిన్ గా ఎదిగింది.
ఇప్పుడు తెలుగులో కాజల్ అగర్వాల్ తొలి హీరో కల్యాణ్ రామ్ సరసన మళ్లీ ఛాన్స్ కొట్టేసింది కాజల్. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ కల్యాణ్‌రామ్ సరసన హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఉపేంద్ర మాధవ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
ఈ చిత్రానికి ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్ పరిశీలనలో ఉందట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌కు జోడీగా కాజల్‌ను ఎంపిక చేశారట. ఇదిలా ఉంటే.. తొలి చిత్రదర్శకుడు తేజ దర్శకత్వంలో ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాలో నటించనున్నది నిజమే అయితే.. తొలి దర్శకుణ్ణే కాదు.. హీరోనూ రిపీట్ చేసినట్లవుతుంది.