రాజమౌళి భక్తుడిగా మారాడు

Published : May 15, 2017, 03:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
రాజమౌళి భక్తుడిగా మారాడు

సారాంశం

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న రాజమౌళి రాజమౌళితో పాటు రమా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, నిర్మాత సాయి కొర్రపాటి పెద్దగా దైవభక్తి లేని రాజమౌళి ఆధ్యాత్మిక క్షేత్రంలో కనిపించి సందడి

ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన కర్నూలు జిల్లా మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామి వారిని దర్శక బాహుబలి రాజమౌళి కుటుంబం దర్శించుకుంది. ముందుగా గ్రామదేవత మంచాలమ్మకు మొక్కులు చెల్లించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాజమౌళి వెంట..అతని భార్య రమా రాజమౌళి, తండ్రి విజయేంద్ర ప్రసాద్, నిర్మాత సాయి కొర్రపాటిలు ఉన్నారు.

 

తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న మంత్రాలయం విచ్చేశారనే వార్త తెలియడంతో.. అభిమానులు రాజమౌళిని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆయనతో సెల్ఫీదిగడానికి అభిమానులు క్యూ కట్టారు. పూజ అనంతరం అభిమానులతో రాజమౌళి ముచ్చటించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్