కాజల్ గర్భవతా ? ఆచార్య ఓకే.. ఆ సినిమా పరిస్థితి ఏంటి..

pratap reddy   | Asianet News
Published : Sep 15, 2021, 05:06 PM IST
కాజల్ గర్భవతా ? ఆచార్య ఓకే.. ఆ సినిమా పరిస్థితి ఏంటి..

సారాంశం

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలకు ఆమె లక్కీ హీరోయిన్ కూడా. 

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలకు ఆమె లక్కీ హీరోయిన్ కూడా. కమర్షియల్ చిత్రాల్లో కాజల్ కు ఉన్న సక్సెస్ రేట్ ఇప్పటి హీరోయిన్లు ఎవరికీ లేదు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కాజల్ కెరీర్ గ్రాఫ్ టాప్ లోనే కొనసాగుతోంది. 

తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కాజల్ గర్భవతి అయినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

ఆమె ఇప్పుడు గర్భం దాల్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్, గౌతమ్ కిచ్లు త్వరలోనే మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కాజల్ కెరీర్ నుంచి కొంత బ్రేక్ తీసుకోక తప్పదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ఆచార్య చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ తుది దశకు చేరుకుంది కాబట్టి సమస్య ఉండదు. 

 కానీ కాజల్ ఇటీవల అంగీకరించిన చిత్రాల నుంచి డ్రాప్ కావాల్సి ఉంటుందని అంటున్నారు. ఆచార్య తర్వాత కాజల్.. కింగ్ నాగార్జున ఘోస్ట్ చిత్రానికి సైన్ చేసింది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ చిత్రాల నుంచి కాజల్ తప్పుకోక తప్పదని అంటున్నారు. ప్రెగ్నన్సీ వార్తలపై కాజల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..