`ఎన్‌బీకే 107` సినిమాపై స్పందించిన యూనిట్‌.. `రౌడీయిజం`పై క్లారిటీ

Published : Sep 15, 2021, 05:02 PM IST
`ఎన్‌బీకే 107` సినిమాపై స్పందించిన యూనిట్‌.. `రౌడీయిజం`పై క్లారిటీ

సారాంశం

ముఖ్యంగా ఈ చిత్రానికి `రౌడీయిజం` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం స్పందించింది. అందులో నిజం లేదని తెలిపింది. `ఎన్‌బీకే107` టైటిల్‌ ఫిక్స్ అయిందని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు నెక్ట్స్ ఆయన గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయనున్నారు. `ఎన్‌బీకే107` వర్కింగ్‌ టైటిల్‌గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి అనేక పుకార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథ గురించి, టైటిల్‌ గురించి వార్తలొస్తున్నాయి. 

ముఖ్యంగా ఈ చిత్రానికి `రౌడీయిజం` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం స్పందించింది. అందులో నిజం లేదని తెలిపింది. `ఎన్‌బీకే107` టైటిల్‌ ఫిక్స్ అయిందని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. సరైన సమయంలోనే టైటిల్‌ని, సినిమాకి సంబంధించిన విషయాలను వెల్లడిస్తాం. అప్పటి వరకు వెయిట్‌ చేయండని తెలిపింది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ఉత్సుకత విషయంలో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే `క్రాక్‌` తర్వాత గోపీచంద్‌ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న చిత్రమిది. `క్రాక్‌` చిత్రం చూసిన బాలయ్య దర్శకుడు గోపీచంద్‌ మలినేని అభినందించారు. తనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆసక్తిని వెల్లడించారు. దీంతో గోపీచంద్‌ ఓ కథని తయారు చేయడం, దానికి బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, ఇటీవల సినిమాని అధికారికంగా ప్రకటించడం  చక చక జరిగిపోయాయి. ఇక ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌ విలన్‌ పాత్రని పోషిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు భిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు టాక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్