`లెహరాయి` సాంగ్‌లో రెచ్చిపోయిన అఖిల్‌, పూజా హెగ్డే.. రొమాన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్లారుగా!

Published : Sep 15, 2021, 04:27 PM IST
`లెహరాయి` సాంగ్‌లో రెచ్చిపోయిన అఖిల్‌, పూజా హెగ్డే.. రొమాన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్లారుగా!

సారాంశం

`లెహరాయి` అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మోస్ట్ లవ్‌ అండ్‌ రొమాంటిక్‌గా ఈ పాట సాగుతుంది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. గోపీసుందర్‌ సంగీతం అందించగా, శ్రీమణి పాటని రాశారు. అఖిల్‌, పూజా హెగ్డే ల మధ్య సాగే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ శ్రోతలను కట్టిపడేస్తుంది.

అఖిల్ అక్కినేని‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. వచ్చే నెల సినిమాని విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషనల్‌ కార్యక్రమాలు షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి మంచి రొమాంటిక్‌ సాంగ్‌ని విడుదల చేశారు. రెండు రోజుల ముందు సాంగ్‌ గ్లింప్స్ ని రిలీజ్‌ చేయగా, తాజాగా బుధవారం ఈ చిత్ర ఫుల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. 

`లెహరాయి` అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మోస్ట్ లవ్‌ అండ్‌ రొమాంటిక్‌గా ఈ పాట సాగుతుంది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. గోపీసుందర్‌ సంగీతం అందించగా, శ్రీమణి పాటని రాశారు. అఖిల్‌, పూజా హెగ్డే ల మధ్య సాగే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ శ్రోతలను కట్టిపడేస్తుంది. ప్రేమ లోతులను తడుముతోంది. హీరోహీరోయిన్ల మధ్య ఇంటెన్సిటీకి ఇది అద్దం పడుతుంది. ఘాటు ప్రేమని తెలియజేస్తుంది. 

ఈ పాటని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ పూజా ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసింది. `రండి రొమాంటిక్‌, బ్రీజీ మెలోడీ లెహరాయి పాటతో ప్రేమలో పండండి` అని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐ హర్ష(అఖిల్‌),స్టాండప్‌ కమెడీయన్‌ విభ(పూజా)ల మధ్య ప్రేమ కథని తెలిపేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. ఈషా రెబ్బా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌, ప్రగతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 8న విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్