Kaikala Satyanaranyana:మెరుగైన కైకాల ఆరోగ్యం... తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దు!

Published : Nov 23, 2021, 11:05 AM ISTUpdated : Nov 23, 2021, 11:16 AM IST
Kaikala Satyanaranyana:మెరుగైన కైకాల ఆరోగ్యం... తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దు!

సారాంశం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ కండిషన్ పై కుటుంబ సభ్యులు స్పందించారు. కైకాల ఆరోగ్యం మరింత దిగజారిందంటూ తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన చేశారు.

అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ (Kaikala Satyanaranyana) ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయన స్పృహలోకి రావడం జరిగింది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కావడం జరిగింది రెండు కిడ్నీలు సాధారణంగా పనిచేస్తున్నాయి.  యూరిన్ ఫ్లో మెరుగు కావడంతో పాటు వెంటిలేటర్ పై ఆధారపడడం తగ్గిందని డాక్టర్స్ వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఐసీయూ లో ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తునట్లు వైద్యులు తెలియజేశారు. 


ఇక కైకాల ఆరోగ్యం మరింత క్షీణించింది అంటూ వస్తున్న వార్తలో ఎటువంటి నిజం లేదని, ఆయన కూతురు రమాదేవి తెలియజేశారు. ఆమె మీడియా వర్గాలకు ఓ ఆడియో బైట్ విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్యం మెరుగవుతుంది. ఆయన త్వరగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలియజేశారు. నిన్న మాదాల రవి గారు రావడంతో గుర్తుపట్టి థంబ్స్ అప్ సింబల్ చూపించారు. మీడియాలో ఆయన ఆరోగ్యంపై తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. దాని వలన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని ఆమె వేడుకున్నారు.

Also read Kaikala Satyanarayana Health Update: ఇంకా క్రిటికల్‌గానే ఆరోగ్యం.. ఐసీయులోనే చికిత్స

నవంబర్ 20వ తేదీ ఉదయం  కైకాల సత్యనారాయణ జ్వరం, నీరసంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల బృందం ఆయనను కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు. ఫలితం పై మాత్రం నమ్మకం లేదని తెలియజేశారు. దీనితో ఆయన అభిమానులు ఆందోళన చెందారు.  తాజా ప్రకటనతో కొంత ఆందోళన తగ్గింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారనే నమ్మకం ఏర్పడింది. 

కళామతల్లి ముద్దు బిడ్డగా ఆరు దశాబ్దాలు సేవలు అందించిన కైకాల సత్యనారాయణ కోలుకొని తిరిగి రావాలని, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. 86 ఏళ్ల కైకాల సత్యనారాయణ టాలీవుడ్ మొదటితరం నటుల్లో అగ్రగణ్యుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రనటులతో వందల కొద్దీ సినిమాలలో కలిసి నటించారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సోషల్ ఇలా భిన్నమైన జోనర్స్ లో 700 వందలకు పైగా చిత్రాలలో కైకాల సత్యనారాయణ నటించారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం