'కబీర్ సింగ్' ట్రైలర్.. 'అర్జున్ రెడ్డి'ని దింపేశారు!

Published : May 13, 2019, 03:01 PM IST
'కబీర్ సింగ్' ట్రైలర్.. 'అర్జున్ రెడ్డి'ని దింపేశారు!

సారాంశం

టాలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. 'కబీర్ సింగ్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

మాతృకను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే రీమేక్ ని కూడా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ లో ఏ సన్నివేశాలనైతే చూపించారో.. రీమేక్ ట్రైలర్ లో కూడా అవే చూపించారు.

కానీ నేపధ్య సంగీతం డిఫరెంట్ గా ఉంది. అదే ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. జూన్ 21న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్