మహేష్ బాబు నానమ్మ కష్టాలు తెలుసా.. కృష్ణ ప్రతి చిత్రం..

Published : May 13, 2019, 02:14 PM IST
మహేష్ బాబు నానమ్మ కష్టాలు తెలుసా.. కృష్ణ ప్రతి చిత్రం..

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రైతుల సమస్యలపై తెరకెక్కించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. మహర్షి చిత్రం పుణ్యమా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వీకెండ్ వ్యవసాయం ట్రెండింగ్ లో నిలుస్తోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రైతుల సమస్యలపై తెరకెక్కించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. మహర్షి చిత్రం పుణ్యమా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వీకెండ్ వ్యవసాయం ట్రెండింగ్ లో నిలుస్తోంది. మహేష్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే అశ్విని దత్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో ఆయన తల్లి నాగరత్నమ్మ గారిని రెండుమూడు సందర్భాల్లో కలిశానని తెలిపారు. అప్పట్లో కృష్ణ రైతుగా నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ గా నిలిచేది. అదే మ్యాజిక్ ని మహేష్ మహర్షి చిత్రంతో రిపీట్ చేశారు. మహేష్ నానమ్మ ఓ రైతు. ఆమె ఎన్నో కష్ఠాలు ఎదుర్కొని అనేక పంటలు పండించినట్లు నాతో స్వయంగా చెప్పారు అని అశ్విని దత్ అన్నారు. 

ఈ విధంగా మహేష్ కుటుంబం కూడా వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినవారే. మహేష్ మాత్రమే కాదు అన్ని కుటుంబాల పూర్వీకులు రైతులుగా బతికినవారే. మహర్షి చిత్రం తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రలో 50 కోట్ల షేర్ కు చేరువగా వచ్చింది. సోమవారం నుంచి కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఘనవిజయం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ-జైల్లోనే శ్రీధర్-కార్తీక్‌కి షాకిచ్చిన తాత
Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు