'రంగస్థలం' నుంచి బయటపడలేకున్నాడా!

Published : May 13, 2019, 01:51 PM IST
'రంగస్థలం' నుంచి బయటపడలేకున్నాడా!

సారాంశం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం విడుదలై ఏడాది గడచిపోయినా ఇప్పటికీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. రంగస్థలం చిత్రం టాలీవుడ్ బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం విడుదలై ఏడాది గడచిపోయినా ఇప్పటికీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. రంగస్థలం చిత్రం టాలీవుడ్ బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 1980నాటి పరిస్థితులు, గ్రామ పంచాయతీ నేపథ్యం ఉన్న కథతో సుకుమార్ మ్యాజిక్ చేశారు. ఇలాంటి అద్భుతాలు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. 

కానీ సుకుమార్ మాత్రం తన నెక్స్ట్ మూవీ రంగస్థలంని మించేలా ఉండాలని ప్రయత్నిస్తున్నారట. మహేష్ తో సినిమా చేయడానికి కథపై కొన్ని నెలల పాటు వర్క్ చేశారు. కానీ అనుకోని కారణాలవలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. బన్నీ, సుకుమార్ కాంబోలో సినిమాకు ప్రకటన అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. 

బన్నీ కోసం కూడా సుకుమార్ వైవిధ్యభరితమైన కథని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ నెక్స్ట్ మూవీ అంటే తప్పకుండా రంగస్థలంతో పోల్చే అవకాశం ఉంది. అందువల్లే ఈ దర్శకుడు కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వంతో మ్యాజిక్ చేసే సుకుమార్ కు రంగస్థలంని మించే చిత్రం చేయడం పెద్ద కష్టం కాదు. 

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి